మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

Posted By:

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న హ్యాకింగ్ ఉదంతాలు నెటిజనులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటనను పరిశీలించినట్లయితే సెలబ్రెటీలకు సంబంధించి అకౌంట్‌ల వివరాలను దొంగిలించిన హ్యాకర్లు వారి న్యూడ్ ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారమే లేపింది. ఈ డేటాను హ్యాకర్లు ఐక్లౌడ్ తదితర క్లౌడ్ సర్వీసులు నుంచి దొంగిలించినట్లు తెలుస్తోంది. మరోవైపు గూగుల్ అకౌంట్స్‌కు చెందిన దాదాపు 50 లక్షల యూజర్ నేమలతో పాటు పాస్‌‌వర్డ్‌లను హ్యాకర్లు దొంగిలించినట్లు వెబ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

మొత్తం 49.3 లక్షల అకౌంట్‌లకు సంబంధించి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లతో కూడిన డాటాను రష్యాకు చెందిన ఆన్‌లైన్ ఫోరమ్ బిట్‌కాయిన్ సెక్యూరిటీ‌లో (btcsec.com) పోస్ట్ చేసింది. టీవీస్కిట్ అనే యూజర్ నేమ్‌తో ఈ డేటా బిట్‌కాయిన్ ఫోరమ్‌లో అప్‌లోడ్ అయినట్లు సమాచారం. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో 60 శాతం అకౌంట్లను ఇప్పుడికి వాడుతున్నారని సదరు డేటాను పోస్ట్ చేసిన యూజర్ చెప్పటం ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన గూగుల్, జీమెయిల్ యూజర్లు తమ అకౌంట్‌లను మార్చుకోవాలని సూచించింది. సెక్యూరిటీ విషయంలో జీమెయిల్ యూజర్లను ఎప్పటికప్పుడు తాము అప్రమత్తం చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రత కోసం జీమెయిల్ యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం మంచిదని వెల్లడించింది. టూ స్టెప్ వెరిఫికేషన్ వెరిఫికేషన్‌లో భాగంగా మొదటి స్టెప్ పాస్‌వర్డ్ రూపంలో, రెండవ స్టెప్ పాస్‌ కోడ్ రూపంలో వినియోగించవల్సి ఉంటుంది.

టూ స్టెప్ వెరిఫికేషన్ విధానంలో భాగంగా మీరు మీ మొబైల్ నెంబరును గూగుల్ అనుసంధానించవల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నంలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన ప్రతిసారి మీ మొబైల్ ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ నెంబరుతో మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ కోడర్ నెంబరు ఇతరులకు తెలియదు కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్ ఇతరులు ఎవరూ హ్యాకింగ్ చేయబలరు. దీనివల్ల మీ మెయిల్‌లో సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.

గూగుల్ యూజర్లు తమ ఆన్‌లైన్ డేటాను మరింత సురక్షితంగా ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియను ఉపయోగించుకునే తీరును క్రింది స్లైడ్‌‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

ముందుగా మీ గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. కుడివైపు టాప్ మెనూ బార్‌లో కనిపించే అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

ఆ తరువాత కనిపించే పేజీలో పైన కనిపించే సెక్యూరిటీ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే పాస్‌వర్డ్ డైలాగ్ బాక్స్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ పక్కన కనిపించే "Setup" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత కనిపించే పేజీలో "Start setup" బటన్ పై క్లిక్ చేసినట్లయితే టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

టూ స్టెప్ వెరిఫికేషన్ కోడ్‌ను యాక్టివేట్ చేసుకునే క్రమంలో ప్రతిసారి వెరిఫికేషన్ కోడ్ అందవల్సిన ఫోన్ నెంబర్‌ను మీరు ఎంటర్ చేయవవల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను బట్టి ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో మీ ఫోన్‌కు అందుతుంది.

 

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

తక్షణమే, మీరు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్ రూపంలో 6 అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆ కోడ్‌ను మీరు Enter verification code ఆప్షన్ ప్రక్కన కనిపించే ఖాళీ బాక్సులో ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

మీ గూగుల్ డేటా భద్రత కోసం ఆరు అత్యుత్తమ సెక్యూరిటీ చిట్కాలు

తరువాత ప్రత్యక్షమయ్యే Trust this computer బాక్సులో "Next" ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసేందుకు "Confirm" ఆప్షన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. అలా చేసినట్లయితే మీ గూగుల్  అకౌంట్‌కు గూగుల్ టూ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ అమలైనట్లే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Six easy Google steps to secure your data. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot