స్క్రీన్ గార్డ్ కొనాలి అనుకుంటున్నారా అయితే ఈ 6 టిప్స్ పాటించండి

By Anil

  స్మార్ట్ ఫోన్ లో ముఖ్యమైనది ఫోన్ డిస్‌ప్లే .ఒక్కసారి ఫోన్ డిస్‌ప్లే పోతే దానిని మార్చాలంటే చాలా ఖర్చు అవుతుంది . అలా ఖర్చు అవ్వకుండా ఫోన్ డిస్‌ప్లే ని కాపాడడానికి Screen protectors ప్రముఖ పాత్రను పోషిస్తుంది. వీటిని tempered glass లేక screen guard అంటూవుంటాం. మార్కెట్ లో అన్ని రకములైన స్క్రీన్ పోటెక్టర్స్ అందుబాటులో ఉన్నాయి . సన్నని వాటిని నుండి మందపాటి స్వభావం గల గ్లాసుల వరకు, స్క్రీన్ గార్డ్ లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల,మీ ఫోన్ స్క్రీన్ కు ఎలాంటి స్క్రీన్ గార్డ్స్ వాడాలో అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  స్క్రీన్ గార్డ్ ఎందుకు వాడాలి:

  ఇప్పుడు మార్కెట్ లో లభ్యమవుతున్న చాలా స్మార్ట్ ఫోన్స్ గొరిల్లా గ్లాస్ ,స్క్రాచ్ ప్రూఫ్ ,వాటర్ ప్రూఫ్ తో అందుబాటులో ఉన్నాయి.మొబైల్ స్క్రీన్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చాలా యాడ్స్ లో కూడా మీరు చూడవచ్చు.అయినప్పటికీ, స్క్రీన్ ను హాని కలిగించే అనేక అబ్రాసీవ్లు, బీచ్ ఇసుక వంటివి ఉన్నాయి.అలంటి వాటి నుంచి కూడా స్క్రీన్ కి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది

  ఎన్ని రకాలు ఉన్నాయ్ ?

  రెండు రకాల స్క్రీన్ ప్రొటెక్టర్స్ మనకు ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి plastic film మరియు tempered glass . మొదటిది, మొదటి తరం స్క్రీన్ ప్రొటెక్టర్, ఇది మీ స్క్రీన్ ఫై గట్టిగా ఉండే ఒక సన్నని షీట్. ఇది ఫోన్ పరిమాణం ఫై ఆధారపడి ఉంటుంది.మీ మొబైల్ ఫై గీతలు పడకుండా నివారించేందుకు వీటిని ఉపయోగిస్తారు.
  రెండవది tempered glass ఇది చాలా దృడంగా ఉండి మీ మొబైల్ ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఈ tempered glass మీ మొబైల్ పైన రెండవ స్క్రీన్ గా పని చేస్తుంది మరియు మొబైల్ వాడేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది.

  Tempered glass అంటే ఏంటి ?

  Tempered glass గాజు తో చేయబడుతుంది.ఇది చాలా మందంగా తయారు చేయబడుతుంది. ఈ Tempered glass మీ మొబైల్ స్క్రీన్ పై రెండవ లేయర్ గ పని చేస్తుంది.ఒక వేళా ఫోన్ డిస్‌ప్లే వేడెక్కిన ఈ tempered గ్లాస్ చల్లబరుస్తుంది. మీ ఫోన్ ఫై నీటి చుక్కలు పడిన గీతాలు పడిన మీ ఫోన్ స్క్రీన్ ను ఎం అవ్వకుండా కాపాడుతుంది .

  Tempered glass ని వంచవచ్చా ?

  మార్కెట్ లో చాలా మొబైల్స్ అందుబాటులో ఉంటాయి అన్ని మొబైల్స్ ఒకేలా ఉండవు కొన్ని మొబైల్స్ కి కర్వ్స్ ఉంటాయి అలంటి మొబైల్స్ ఫై కూడా Tempered glass ని అతికించాలి కాబట్టి tempered glass ని కొంచెం వంచవచ్చు

  స్క్రీన్ గార్డ్ యొక్క టెర్మినాలజీ :

  Privacy layer :ఈ ఫీచర్ వల్ల చూసే కోణం ఎంతలా తగ్గుతుంది అంటే పక్కన ఉన్న వారు కూడా స్క్రీన్ పై ఉన్న దానిని చూడలేరు

  Matte display:ట్రాన్సపరెంట్ గా ఉండే glossy display వేసుకోవాలో లేక Matte display వేసుకోవాలో అది వినియోగదారుడి ఇష్టం

  పార్షియల్ ప్రొటెక్షన్ :

  స్క్రీన్ గార్డ్ ఎప్పడు పార్షియల్ ప్రొటెక్షన్ మాత్రమే ఎందుకంటే ఇది మీ ఫోన్ స్క్రీన్ ని మాత్రమే కాపాడుతుంది. మీ మొబైల్ ఫోన్ ఎప్పుడైనా కింద పడితే ఫోన్ అంచుల్లో తగులుతుంది అందువల్ల ఫోన్ అంచులు కూడా కవర్ అయ్యేలా స్క్రీన్ గార్డ్స్ ను కొనండి

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Six tips to know before buying a tempered glass screen protector.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more