Home
How to

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా.. బ్యాటరీ లైఫ్ పెంచే 10 సూపర్ టిప్స్..!

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో ఒక భాగమైపోయింది. కాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఎన్నో వాటికి. కానీ, బ్యాటరీ ఫాస్ట్‌గా డ్రెయిన్ అయితే, అన్నీ పనులూ ఆగిపోతాయి. మీ ఫోన్‌లో కూడా తరచూ త్వరగా ఛార్జింగ్ అయిపోతుంటే దాని వెనుక కొన్ని సింపుల్ రీజన్స్ ఉండొచ్చు. దీన్ని సరిచేయడానికి, బ్యాటరీ లైఫ్, లాంగ్-టర్మ్ బ్యాటరీ హెల్త్ పెంచుకోవడానికి కొన్ని స్మార్ట్ టిప్స్ ఉన్నాయి.

1. బ్యాటరీ సేవర్ లేదా లో-పవర్ మోడ్ ఆన్ చేయండి
ఇప్పటి ఫోన్లలో బిల్ట్-ఇన్ బ్యాటరీ సేవర్ మోడ్స్ ఉంటున్నాయి. ఇవి ఆన్ చేసినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని, విజువల్ ఎఫెక్ట్స్‌ని తగ్గిస్తాయి. మీ బ్యాటరీ 20% కంటే తక్కువకు వచ్చినప్పుడు ఈ ఫీచర్ వాడండి. ఇది మిగిలిన ఛార్జ్‌ ఎక్కువసేపు వచ్చేలా చేస్తుంది.

Smartphone Losing Charge Too Fast

2. స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి, డార్క్ మోడ్ వాడండి
మీ ఫోన్ స్క్రీన్ ఎక్కువ పవర్ తీసుకుంటుంది. బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే బ్యాటరీ ఫాస్ట్‌గా ఖర్చవుతుంది. ఆటో-బ్రైట్‌నెస్‌కి మార్చండి లేదా మీరే తగ్గించుకోండి. మీ ఫోన్‌లో OLED స్క్రీన్ ఉంటే, డార్క్ మోడ్ ఆన్ చేయండి. ఇది పవర్ వాడకాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే నల్ల పిక్సెల్స్‌కి తక్కువ శక్తి అవసరం.

3. స్మార్ట్‌గా ఛార్జ్ చేయండి, ఓవర్‌ ఛార్జింగ్ వద్దు
ఫోన్ బ్యాటరీని తరచూ సున్నా శాతానికి రానివ్వడం వల్ల డ్యామేజ్ అవుతుంది. బ్యాటరీని 20% నుంచి 80% మధ్యలో ఉంచడానికి ట్రై చేయండి. రాత్రంతా ఛార్జింగ్ పెట్టొద్దు, టైమ్ తక్కువగా ఉన్నప్పుడే ఫాస్ట్ ఛార్జింగ్ వాడండి. రోజూ ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.

4. స్క్రీన్ టైమ్‌అవుట్ డ్యూరేషన్ తగ్గించండి
మీరు వాడటం ఆపేశాక కూడా స్క్రీన్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంటే, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. స్క్రీన్ టైమ్‌అవుట్‌ని 15 లేదా 30 సెకన్లకు సెట్ చేయండి. దీనివల్ల ఫోన్‌ వినియోగించనప్పుడు డిస్‌ప్లే త్వరగా ఆఫ్ అయి, పవర్ ఆదా అవుతుంది.

5. బ్యాక్‌గ్రౌండ్ యాప్స్, లొకేషన్ సర్వీసులను ఆపేయండి
చాలా యాప్స్ సైలెంట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. వాటిని వాడకపోయినా బ్యాటరీని తినేస్తాయి. మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, వినియోగించని యాప్స్‌ని ఆపేయండి. అలాగే, GPS, బ్లూటూత్, NFC అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి.

6. వీలైనప్పుడు ఫ్లైట్ మోడ్ వాడండి
నిద్రపోతున్నప్పుడు, సిగ్నల్ లేని చోట ఉన్నప్పుడు, లేదా కనెక్టివిటీ అవసరం లేనప్పుడు ఫ్లైట్ మోడ్‌కి మార్చండి. ఇది అన్ని రేడియో సిగ్నల్స్‌నీ కట్ చేసి, రాత్రిపూట లేదా లాంగ్ బ్రేక్స్‌లో మంచిగా బ్యాటరీని ఆదా చేస్తుంది.

7. ప్రత్యామ్నాయ ఛార్జింగ్ సోర్స్‌లు వాడండి
ట్రావెలింగ్ చేసేటప్పుడు కార్ ఛార్జర్లు లేదా సోలార్ పవర్ బ్యాంకులు వాడండి. ఇవి రెగ్యులర్ సాకెట్ల మీద ఆధారపడటాన్ని తగ్గిస్తాయి, ఎమర్జెన్సీ టైమ్‌లో బ్యాటరీ హెల్త్‌కి కూడా మంచిది.

8. వారానికి ఒకసారి మీ ఫోన్‌కు రెస్ట్ ఇవ్వండి
వారానికి ఒకసారి, ఒక రాత్రిపూట మీ ఫోన్‌ని వాడకుండా ఉండండి. ఈ సింపుల్ రెస్ట్ వల్ల బ్యాటరీ కూల్ అవుతుంది, లాంగ్ టర్మ్ పనితీరును అందిస్తుంది. మీ డివైజ్‌కి ఒక మినీ రీసెట్ లాంటిది.

9. సాఫ్ట్‌వేర్, యాప్స్‌ని అప్‌డేట్‌గా ఉంచుకోండి
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో తరచూ బ్యాటరీ ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటాయి. మీ ఫోన్ సిస్టమ్, యాప్స్ ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే, వాడని యాప్స్‌ని తీసేయండి లేదా డిసేబుల్ చేయండి. అవి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్యాటరీని డిశ్ఛార్జి చేస్తుంటాయి.

10. వైబ్రేషన్ ఆఫ్ చేయండి, యానిమేషన్స్ తగ్గించండి
సింపుల్ సౌండ్ అలర్ట్స్ కంటే వైబ్రేషన్ ఎక్కువ పవర్ తీసుకుంటుంది. కాల్స్, నోటిఫికేషన్లకు వైబ్రేషన్ ఆఫ్ చేయండి. అలాగే, సిస్టమ్ సెట్టింగ్స్‌లో యానిమేషన్ ఎఫెక్ట్స్‌ని తగ్గించండి లేదా ఆపేయండి. దీనివల్ల కూడా పవర్ ఆదా అవుతుంది.

Best Mobiles in India

English summary
Smartphone Losing Charge Too Fast? 10 Proven Tips to Instantly Boost Battery Life and Health
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X