Snapchat లో కొత్తగా 'రెస్టారెంట్‌ రికమెండ్' ఫీచర్‌!! ఉపయోగించే విధానం

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో సోషల్ మీడియా యాప్ల గురించి తెలియని వారు మరియు ఉపయోగించని వారు ఉండరు. స్నేహితులతో స్టోరీలను పంచుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే యాప్లలో స్నాప్‌చాట్ కూడా ఒకటి. ఈ యాప్ ఫిల్టర్‌లు, జియోఫిల్టర్‌లు, కస్టమ్ స్టోరీలతో పాటుగా మరిన్ని ఇతర ఫీచర్‌లను కూడా అందిస్తుంది. స్నాప్‌చాట్ ఇటీవల 'షేర్డ్ స్టోరీస్' అనే మరో ఫీచర్‌ను కూడా జోడించింది. ఇప్పుడు అదనంగా మీ చుట్టూ ఉన్న లొకేషన్‌లోని రెస్టారెంట్‌లను వెతకడానికి అనుమతించే మరొక ఉపయోగకరమైన ఫీచర్‌తో యాప్‌ని అప్‌డేట్ చేస్తోంది.

Snapchat New Feature Restaurant Recommendation Using Process Step by Step

స్నాప్ మ్యాప్‌లో రెస్టారెంట్ల జోడింపు

స్నాప్‌చాట్ లో ఇప్పటికే ఉన్న స్నాప్ మ్యాప్‌కి కొత్తగా మ్యాప్ లేయర్‌ని జోడించింది. ఇది రెస్టారెంట్ రివ్యూ సైట్ యొక్క ఇన్‌ఫాచుయేషన్ భాగస్వామ్యంతో రూపొందించబడింది. ఈ భాగస్వామ్యంతో స్నాప్‌చాట్ రెస్టారెంట్ల యొక్క రివ్యూ ఫీచర్ ని కలిగి ఉంటుంది. దీని కారణంగా వినియోగదారులు నేరుగా స్నాప్‌చాట్ యాప్‌లో నేరుగా రెస్టారెంట్ యొక్క రివ్యూలను వీక్షించవచ్చు. అదనంగా వినియోగదారులు తమకు ఇష్టమైన రెస్టారెంట్లను కూడా తమ యొక్క స్నేహితుల కోసం షేర్ చేయవచ్చు మరియు వాటిని బుక్‌మార్క్ చేయవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏ ఇతర యాప్‌లా కాకుండా మీరు సందర్భానుసారంగా రెస్టారెంట్ సిఫార్సులను పొందవచ్చు. ఉదాహరణకు మీ యొక్క పుట్టినరోజున ఇతర ఫిల్టర్‌ల ద్వారా రెస్టారెంట్ సెర్చ్ ను తగ్గించవచ్చు.

Snapchatలో రెస్టారెంట్ సిఫార్సులను పొందే విధానం

Snapchat New Feature Restaurant Recommendation Using Process Step by Step

** ముందుగా మీరు ఉపయోగిస్తున్న ఫోన్ లోని స్నాప్‌చాట్ యాప్ తాజా వెర్షన్‌లో ఉందని నిర్ధారించుకోండి. లేకపోతే కనుక యాప్‌ని తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం ముఖ్యం.

** తరువాత మీ ఫోన్‌లో స్నాప్‌చాట్‌ని ఓపెన్ చేస ఎడమవైపు ఎగువ భాగంలో ఉన్న ప్రొఫైల్ చిహ్నంపై నొక్కండి.

** తరువాత క్రిందికి స్క్రోల్ చేసి 'స్నాప్ మ్యాప్' ఎంపికను ఎంచుకోవడానికి దాని మీద నొక్కండి.

** స్నాప్ మ్యాప్‌పై క్లిక్ చేసిన తర్వాత లొకేషన్‌ను అనుమతించమని యాప్ అడగవచ్చు.

** స్నాప్‌చాట్‌ని మీ లొకేషన్‌ని యాక్సెస్ చేయడానికి అనుమతించిన తర్వాత కుడివైపు ఎగువ మూలలో ఉన్న 'ఇన్‌ఫాచ్యుయేషన్' చిహ్నంపై నొక్కండి.

** ఇప్పుడు మీరు స్నాప్ మ్యాప్‌లోని రెస్టారెంట్ సిఫార్సులు మరియు రివ్యూలను చూడవచ్చు. ఒకవేళ వెంటనే ఏమీ పొందకుంటే కనుక మీరు రెస్టారెంట్‌ను కనుగొనే వరకు స్నాప్‌చాట్‌లో మరికొంత సమయం ఉండవచ్చు.

Best Mobiles in India

English summary
Snapchat New Feature 'Restaurant Recommendation' Using Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X