Home
How to

మీ హెడ్‌ఫోన్స్ వర్క్ అవటం లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి,

మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు హెడ్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినేందుకు ఆసక్తి చూపుతుంటారు. హెడ్‌ఫోన్‌లను రెగ్యులర్‌గా వినియోగించుకునే క్రమంలో, వాటిలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి.

By Bommu Sivanjaneyulu

మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు హెడ్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినేందుకు ఆసక్తి చూపుతుంటారు. హెడ్‌ఫోన్‌లను రెగ్యులర్‌గా వినియోగించుకునే క్రమంలో, వాటిలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా హెడ్‌ఫోన్ జాక్ సరిగ్గా స్పందించకపోవటం వంటి సమస్యను కామన్‌గా ఫేస్ చేయవల్సి ఉంటుంది. ఈ సమస్య మీ హెడ్‌ఫోన్‌లో కూడా ఉన్నట్లయితే సౌండ్ తక్కువుగా రావటం, ఫోన్ కనెక్ట్ కాకపోవటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి హార్డ్‌వేర్‌ను ఛేంజ్ చేయకుండా సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ సింపుల్ ట్రిక్స్‌ను అనుసరించండి...

దుుమ్ము పేరుకుపోవటం వల్ల...

దుుమ్ము పేరుకుపోవటం వల్ల...

ఫోన్‌కు హెడ్‌ఫోన్ జాక్‌లో డస్ట్ ఎక్కువుగా పేరుకపోవటం వల్ల మొబైల్‌కు, హెడ్‌ఫోన్ పిన్‌కు మధ్య కనెక్షన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో హెడ్‌ఫోన్ జాక్‌ను క్లీన్ చేసకోవటం ద్వారా అవి తిరిగి వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. హెడ్‌ఫోన్‌లను క్లీన్ చేసేందుకు ఇంటర్ - డెంటల్ బ్రష్ బెస్ట్ టూల్. ఇయర్ ఫోన్ స్పీకర్ మెస్ పై పేరుకుపోయిన దుమ్మును డ్రై టూత్ బ్రష్ ద్వారా తొలగించవచ్చు. దుమ్ము పేరుకుపోయిన ప్రాంతంలో నెమ్మదిగా బ్రష్ చేయటం వల్ల డర్ట్ మొత్తం తొలగిపోతుంది. కాటన్ స్వాబ్‌ను ఆల్కహాల్ ముంచి ఇయర్‌ఫోన్ ప్లాస్టిక్ భాగాల పై అప్లై చేయటం ద్వారా అవి ఎప్పటికప్పుడు క్లీన్‌‌గా ఉంటాయి. మీ ఇయర్‌ఫోన్‌ను సిలి‌కోన్‌తో తయారైనట్లయితే డిష్ వాషర్ లిక్విడ్‌ను నీటిలో కలిపి అప్లై చేయండి.

హెడ్‌ఫోన్స్ మార్చి చూడండి..

హెడ్‌ఫోన్స్ మార్చి చూడండి..

హెడ్‌ఫోన్ జాక్‌లో పేరుకుపోయిన దుమ్మును క్లీన్ చేసినప్పటికి ఫలితం లేకుండా పోయినట్లయితే కొత్త హెడ్‌ఫోన్స్‌ను ట్రై చేసి చూడండి. అవి వర్క్ అవుతున్నట్లయితే పాత హెడ్‌ఫోన్‌లను పక్కన పెట్టేయటం మంచిది.

స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయటం ద్వారా..

స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయటం ద్వారా..

కొన్ని సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్‌లను రీస్టార్ట్ చేయటం ద్వారా మొబైల్‌కు హెడ్‌ఫోన్‌కు మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం. కాబట్టి మరో ప్రయత్నంగా ఈ ట్రిక్‌ను కూడా అప్లై చేసి చూడండి.

 

 

ఆడియో సాఫ్ట్‌వేర్‌ను మార్చటం ద్వారా..

ఆడియో సాఫ్ట్‌వేర్‌ను మార్చటం ద్వారా..

మ్యూజిక్‌ను వినేందుకు మీరు థర్డ్ పార్టీ ఆడియో సాఫ్ట్‌వేర్‌లను వినియోగిస్తున్నట్లయితే దాన్ని తొలగించి డీఫాల్ట్ మ్యూజిక్ ప్లేయర్ యాప్ ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించే ప్రయత్నం చేయండి. తద్వారా సెట్టింగ్స్ రీసెట్ కాబడి మొబైల్‌కు హెడ్‌ఫోన్‌కు మధ్య కనెక్షన్ తిరిగి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది.

 చివరి ప్రయత్నంగా..

చివరి ప్రయత్నంగా..

పైన పేర్కొన్న సూచనలను పాటించినప్పటికి హెడ్‌ఫోన్స్ స్పందించకపోతున్నట్లయితే చివరి ప్రయత్నంగా హెడ్‌ఫోన్ పిన్‌ను సక్రమంగా ఇన్సర్ట్ చేసారో లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేనట్లయితే సక్రమంగా ఇన్సర్ట్ చేసి చూడండి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
If your audio jack not working then firstly try to solve it via below ways before gives mobile care sometimes there is no problem in hardware and we are troubled by small problem.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X