కొత్తగా ఆలోచించే వాట్సాప్ యూజర్ల కోసం..?

Written By:

వాట్సాప్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలో అందుబాటులోకి రాబోయే వాట్సాప్ మెసెంజర్ 2.16.80 వర్షన్‌లో ఓ మేజర్ అప్‌డేట్‌గా రానున్న ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఆస్వాదించవచ్చు.

కొత్తగా ఆలోచించే వాట్సాప్ యూజర్ల కోసం..?

స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సాప్ సహాయంతో సమచారాన్ని అనేక రూపాల్లో వేగవంతంగా షేర్ చేసుకుంటున్నారు. వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, గ్రూప్ మెసేజింగ్, లోకేషన్ షేరింగ్, ఫోటో షేరింగ్, వీడియో షేరింగ్, ఫైల్ షేరింగ్ ఇలా అనేక ఫీచర్లను వాట్సాప్ చేరువచేస్తుంది. వాట్సాప్ యూజర్లు తెలుసుకోవల్సిన పలు క్రియేటివ్ చిట్కాలను ఇప్పుడు చూద్దాం..

Read More : మార్కెట్లో ఈ వారం లాంచ్ అయిన 10 స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

ఆటోమెటిక్ మల్టీ మీడియా కంటెంట్‌ను నిలిపివేయాలంటే Settings -> Chat Settings -> Media auto-download లోకి వెళ్లి ‘When using mobile data', ‘when connected on WiFi' and ‘When roaming' వంటి ఆప్షన్‌లను అన్‌చెక్ చేయటం ద్వారా ఆటోమెటిక్ మల్టీ మీడియా కంటెంట్‌ను నిలిపివేయవచ్చు.

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

మీ మిత్రులకు సంబంధించిన  ప్రొఫైల్ ఫోటోను వెతకాలంటే ఫోన్‌లోని ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లి WhatsApp and Profile Picturesను ఎంపిక చేసుకోండి. ఇక్కడ ప్రొఫైల్ ఫోటలతో కూడిన మీ మిత్రుల మొబైల్ నెంబర్లను కనిపిస్తాయి.

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేయాలంటే WhatsApp Plus అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను హైడ్ చేసుకోవచ్చు.

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

WhatSaid  తరహా యాప్‌ లను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా నకిలీ సంభాషణలను సృష్టించుకోవచ్చు. (పాఠకులకు గమనిక: WhatSaidను గూగుల్ ప్లే స్టోర్‌ను తొలగించటం జరిగింది)

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

ఈ ట్రిక్ కేవలం మీ ఫోన్‌లో మాత్రమే అమలవుతుంది. ముందుగా మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్‌కు సెట్ చేసిన ఫన్నీ ఫోటోను ఎంపిక చేసుకోండి. ఫోటో సైజు 561×561 పిక్సల్ ఉండాలి. మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్‌తో ఫోటోను రీనేమ్ చేయండి. ఇప్పుడు ఆ ఇమేజ్‌ను SD card > WhatsApp > Profile picture విభాగంలో సేవ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో లేదా నెట్‌వర్క్ డిసేబుల్ చేయండి.

క్రియేటివ్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్‌టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Some Creative Ways To Use Whatsapp. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot