మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

|

టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా నిబంధనల మేరకు పసలేని కారణాలు చూపించి మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనను తిరస్కరించిన సర్వీస్ ప్రొవైడర్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే ఈ క్రింది నిబంధనలను ఆచరించండి.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

 

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీని తిరస్కరించిన ఆపరేటర్ పై ఫిర్యాదు చేయటం ఏలా..?

ముందుగా మీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి. వెంటనే సంబంధిత టెల్కో నుంచి ఫిర్యాదు నెంబర్, తేది, సమయంతో తదితర అంశాలతో కూడిన మెసేజ్ అందుతుంది. ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి. సమస్య పరిష్కారం కాని ఎడల ఆ ఫిర్యాదు నెంబర్‌ను రుజువుగా చూపించి తదుపరి చర్యకు సన్నద్ధం కావచ్చు.

మీ ఫిర్యాదుకు సంబంధించి సదరు టెల్కో స్పందించనట్లయితే అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది. మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌‌సైట్‌‌లో పేర్కొనబడతాయి. లేదా మీసిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి. మీ ఫిర్యాదు స్వీకరించిన అప్పీలేట్ అధికారి సమస్య పరిష్కారానికి కొంత సమయాన్ని అడుగుతారు. వారు పేర్కొన్న వివరాలను భద్రంగా ఉంచాలి. అక్కడ కూడా మీ సమస్య ఓ కొలిక్కిరానట్లయితే అప్పీలేట్ అధికారి ఇచ్చిన వివరాలను రుజువులుగా పేర్కొంటు భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

మీ సమస్యను పరిష్కరించటంలో అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే నేరుగా సంబంధిత రుజువులతో ‘భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖ'(డాట్ )కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందాల్సిన చిరునామా: పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్, రూమ్ నెం.518, సంచార్ భవన్, 20, ఆశోకా రోడ్, న్యూఢిల్లీ 110001.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X