Home
How to

వారానికి ఒక్కసారైనా మీ స్మార్ట్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్ చేయండి.. ఎందుకో తెలుసా?

స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. వ్యక్తిగత అవసరాల నుంచి బ్యాంకింగ్‌ అవసరాల కోసం అనేక మంది స్మార్ట్‌ ఫోన్‌ పైనే ఆధారపడుతున్నారు. అదే సమయంలో స్మార్ట్‌ ఫోన్‌ పై సైబర్‌ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అమెరికా జాతీయ భద్రతా సంస్థ (Smartphone Security Tips By US NSA) కీలక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో స్మార్ట్‌ ఫోన్‌ రక్షణ కోసం అనేక కీలక సూచనలు చేసింది. పూర్తి వివరాలు.

వారానికి ఒక్కసారైనా స్విచ్‌ ఆఫ్‌ మరియు రీస్టార్ట్‌ చేయాలి :
ఈ నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ ఫోన్‌ను కనీసం వారానికి ఒక్కసారైనా స్విచ్‌ ఆఫ్‌ మరియు రీస్టార్ట్‌ చేయాలని సూచించింది. ఇలా చేయడం వల్ల సైబర్‌ దాడుల నుంచి తప్పించుకొనే అవకాశం ఉందని తెలిపింది. సైబర్‌ నేరగాళ్లు అనేక మార్గాల్లో స్మార్ట్‌ ఫోన్‌లపై దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. మాల్‌వేర్‌ ను ఇన్‌స్టాల్‌ చేయడం సహా ఇతర మార్గాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తారు.

turn off your smartphone at least once in week

రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా :
దీంతోపాటు ప్రమాదకర యాప్‌లు సహా కొన్ని వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా దాడి చేసే అవకాశం ఉంది. స్పైవేర్‌ ద్వారా వ్యక్తిగత సంభాషణలను పర్యవేక్షించే ప్రమాదం కూడా ఉంటుంది. రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా కాలింగ్‌ సహా ఇతర డేటాను దొంగిలించే అవకాశం ఉంది. తక్కువ స్టోరేజీలోనూ హానికర సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌ అప్‌డేట్‌గా ఉండేలా చూడండి :
అమెరికా జాతీయ భద్రతా సంస్థ సూచనల ప్రకారం స్మార్ట్‌ ఫోన్‌ సాఫ్ట్‌ వేర్‌ నిత్యం అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి. స్మార్ట్‌ఫోన్ సంస్థ అందిస్తున్న సెక్యూరిటీ అప్‌డేట్‌ ఎప్పటికప్పుడు ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలి. దీంతోపాటు యాప్‌ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అలాంటి సమయంలో బ్లూటూత్‌ను ఆఫ్‌ చేయాలి :
ఈ-మెయిల్‌ మరియు టెక్స్ట్‌ మెసెజ్‌ల ద్వారా వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేయవద్దు. దీంతోపాటు పబ్లిక్‌ వైఫై ల వినియోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలి. VPN ద్వారా కనెక్షన్‌ ను తనిఖీ చేసుకోవాలి. వినియోగించని సమయంలో బ్లూటూత్‌ను ఆఫ్‌ చేయాలి. ఫలితంగా అనధికారికంగా కనెక్ట్‌ అయ్యే డివైజ్‌లను నియంత్రించవచ్చు.

బలమైన పాస్‌వర్డ్‌ సహా.. :
బలమైన పాస్‌వర్డ్‌ ను ఎంచుకోవాలి. దీంతోపాటు బయోమెట్రిక్‌, ఫేసియల్‌ గుర్తింపు వంటి భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ సంస్థలు అందించినా లేదా సిఫార్సు చేసిన ఛార్జర్‌లను మాత్రమే వినియోగించాలి. మరియు USB ఛార్జింగ్‌ స్టేషన్‌లలో ఛార్జింగ్ చేయవద్దు. అవసరం లేని సమయాల్లో లోకేషన్‌ను ఆఫ్‌ చేసుకోవాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
switch off your smartphone atleast once in a week suggested by US NSA
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X