అలర్ట్.. ఈ పాస్‌వర్డ్స్ వాడితే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ, పర్సనల్ డేటా చోరీ.. వెంటనే మార్చేయండి..!!
Most Hackable Passwords: ఈ రోజుల్లో మన జీవితమంతా డిజిటల్ మయం అయింది. బ్యాంక్ అకౌంట్ల దగ్గర్నుంచి, ఈమెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్ల వరకు అన్నిటిపై మనం ఆధారపడుతున్నాం. ఇవి పాస్‌వర్డ్స్‌తోనే సురక్షితంగా ఉంటాయి. కానీ చాలామంది ఇంకా సులభమైన పాస్‌వర్డ్స్‌నే వాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. సైబర్ దొంగలు సులభంగా ఊహించే పాస్‌వర్డ్‌లను సెకన్లలో కొట్టేస్తారు. మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
నార్డ్VPN ఇటీవల చేసిన కొత్త స్టడీలో ఇంకా లక్షల మంది ఈజీగా హ్యాక్ చేసే పాస్‌వర్డ్స్‌నే వాడుతున్నారని తెలిసింది. అందుకే సైబర్ దాడులు ఎక్కువవుతున్నాయి. మీరు కూడా అలాంటి వీక్ పాస్‌వర్డ్స్ వాడుతున్నారా, అయితే మీ డేటా మొత్తం హ్యాకర్లకు ఇచ్చేసినట్టే అవుతుంది.

* డేంజర్ బెల్స్ మోగిస్తున్న పాస్‌వర్డ్స్
చాలామంది కొన్ని పాస్‌వర్డ్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. అవి ఆల్రెడీ కోట్ల సైబర్ దాడుల్లో లీక్ అయినా సరే. అలాంటి అత్యంత ఈజీగా హ్యాక్ చేయగల పాస్‌వర్డ్స్ ఏవో చూద్దాం. ముందుగా చెప్పుకోవాల్సిన పాస్‌వర్డ్ 123456.
ఇది ఏకంగా 50 కోట్ల సైబర్ కేసుల్లో దొరికిందంట. 123456789 అనే మరో పాస్‌వర్డ్ దాదాపు 20 కోట్ల సైబర్ దాడుల్లో కనిపించింది. పాస్‌వర్డ్ 1234 కూడా 45 లక్షల దాడుల్లో బయటపడింది. ఇక 98 లక్షల సార్లు హ్యాక్ అయ్యింది 12345678 అనే ఇంకో పాస్‌వర్డ్.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా హ్యాక్ అయిన పాస్‌వర్డ్‌లలో "12345" ఒకటి, ఇది ఏకంగా 50 లక్షల కేసుల్లో దొంగ పాస్‌వర్డ్‌గా తేలింది. ఇక "password" అనే పాస్‌వర్డ్‌ను ప్రపంచమంతా విచ్చలవిడిగా వాడటం వల్లనే అది ఒక కోటి సార్లు హ్యాక్ అయింది. "111111" అనే పాస్‌వర్డ్ కూడా 54 లక్షల సైబర్ దాడుల్లో లీక్ అయింది.
అలాగే "అడ్మిన్ (Admin)" అనే పాస్‌వర్డ్‌ను కూడా సుమారు 50 లక్షల మంది వాడటం వల్ల హ్యాకర్లకు ఈజీగా చిక్కిపోయింది. "123123" పాస్‌వర్డ్ 43 లక్షల సెక్యూరిటీ బ్రీచ్‌లలో కనిపించింది, చివరగా "abc123" కూడా 42 లక్షల డేటా లీక్స్‌లో బయటపడింది. ఈ గణాంకాలు ఈ పాస్‌వర్డ్‌లు ఎంత ప్రమాదకరమైనవో తెలియజేస్తున్నాయి.
ఈ పాస్‌వర్డ్స్ చాలా వీక్, పిల్లలు కూడా గెస్ చేసేస్తారు. సైబర్ నేరగాళ్లు ఆటోమేటిక్ టూల్స్ వాడితే సెకన్లలో వీటిని కొట్టేస్తారు. మీరు కూడా ఈ పాస్‌వర్డ్స్‌లో ఏ ఒక్కటి వాడుతున్నా వెంటనే మార్చేయాలి. వీక్ పాస్‌వర్డ్ వాడటం అంటే.. మీ ఇంటికి డోర్లే లేనట్టు.
* బలహీన పాస్‌వర్డ్స్ ఎందుకు ప్రమాదకరం
హ్యాకర్లు బ్రూట్-ఫోర్స్ అటాక్స్ లాంటి సింపుల్ టెక్నిక్స్ వాడి కామన్ పాస్‌వర్డ్స్‌ని అంచనా చేస్తారు. ఒక్కసారి మీ అకౌంట్‌లోకి ఎంటర్ అయితే చాలు.. అన్ని అకౌంట్లు వాళ్లే వాడేసుకుంటారు. ముఖ్యంగా మీరు అన్నింటికీ ఒకటే పాస్‌వర్డ్ వాడితే చాలా ప్రమాదకరం. ఐడెంటిటీ దొంగతనం, డబ్బులు పోగొట్టుకోవడం, బ్లాక్‌మెయిల్ చేయడం.. ఇలా చాలా డేంజర్ జరుగుతుంది.
మీ అకౌంట్స్ లాక్ అవ్వడం నుంచి మీ పర్సనల్ డేటా, డబ్బులు మొత్తం పోయే ప్రమాదం ఉంది. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎవ్వరూ ఊహించలేని పాస్‌వర్డ్స్ పెట్టాలి. అది ఎలానో, అందుకు ఏం చేయాలో చూద్దాం. కనీసం 12 క్యారెక్టర్స్ ఉండేలా చూసుకోండి. లెటర్స్, నంబర్స్, సింబల్స్ అన్నీ మిక్స్ చేయాలి.
మీ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబర్ లాంటి పర్సనల్ డీటెయిల్స్ అస్సలు వాడొద్దు. "password123", "qwerty" లాంటి కామన్ పదాలు, నంబర్ సీక్వెన్స్‌లు యూజ్ చేయొద్దు. ప్రతి అకౌంట్‌కి వేర్వేరు పాస్‌వర్డ్స్ పెట్టండి. ఒకవేళ ఒకటి హ్యాక్ అయినా మిగతావి సేఫ్‌గా ఉంటాయి.
పాస్‌వర్డ్ మేనేజర్ యాప్స్ వాడండి. అవి స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేసి సేవ్ చేస్తాయి. స్ట్రాంగ్ పాస్‌వర్డే మిమ్మల్ని హ్యాకర్ల నుంచి కాపాడే మొట్టమొదటి సంరక్షణ. మీ పాస్‌వర్డ్స్‌ని రెగ్యులర్‌గా మార్చాలి. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటే ఇంకా సేఫ్. సైబర్ ఎటాక్ జరిగే వరకు వెయిట్ చేయవచ్చు. ఇప్పుడే మీ అకౌంట్స్‌కు భద్రత పెంచండి. ఈ వార్త మీ బంధుమిత్రులతో తప్పకుండా పంచుకోండి.


Click it and Unblock the Notifications








