అత్యంత తక్కువ ధరకే ఫోన్లను అందిస్తున్న షియోమి రహస్యం ఏంటో తెలుసా..?
షియోమి ఫోన్లు అంత తక్కువ ధరకు ఎలా వస్తున్నాయి, సీక్రెట్ ఇదే !
ఇప్పుడు ఇండియాలో మొబైల్ మార్కెట్ ని శాసిస్తున్నది ఏదైనా ఉందంటే అది చైనా దిగ్గజం షియోమి మాత్రమేనని చెప్పాలి. దిగ్గజాలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తూ షియోమి ఇండియాలో కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతోంది. ఇతర ఫోన్లలో అత్యంత ఎక్కువ ధరల్లో ఉండే ఫీచర్లను తమ ఫోన్లలో వాడుతూ అత్యంత తక్కువ ధరకే వాటిని ఎలా అమ్ముతోంది అనేదానిపై టెక్ విశ్లేషకులు పలు కారణాలు చెబుతున్నారు.

Disrupting the market
షియోమి తన ఫోన్లను కేవలం ఆన్ లైన్ మార్కెట్ ద్వారానే అమ్ముతోంది. దీనికోసం ఎటువంటి మార్కెటింగ్ కాని డీలర్స్ కు కాని అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల కంపెనీకి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించిన ఖర్చులు పూర్తి స్తాయిలో సేవ్ అయినట్లే..ఇదొక మార్కెట్ సూత్రం.

Cost cutting
షియోమి తన ఫోన్ల కోసం ఎటువంటి యాడ్స్ కాని అలాగే దానికి సంబంధించిన ట్రేడిషనల్ అడ్వర్టేజ్ మెంట్లు కాని ఇవ్వదు. మిగతా కంపెనీలు మాత్రం తమ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే భారీగా దానికి అడ్వర్టేజ్ మెంట్ కల్పిస్తారు. దీనికి బోలెడంత ఖర్చు కూడా పెడతారు. అయితే ఈ విషయంలో షియోమి బిజినెస్ మైండ్ చాలా వేరనే చెప్పుకోవాలి. కేవలం సోషల్ మీడియా ద్వారానే షియోమి తన ఫోన్లకు ప్రచారం కల్పించుకుంటూ కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

Limited quantities
షియోమి మార్కెట్లోకి ఫోన్ వదిలే సమయంలో Limited quantities సూత్రాన్ని అవలంభిస్తుంది. కొత్త ఫోన్ మార్కెట్లోకి వదిలేముందు పరిమిత సంఖ్యలో మాత్రమే యూనిట్లను తయారుచేసి వదులుతుంది. అదే ఇతర కంపెనీలు అమ్మకాలు సంగతి అటుంచి ఎక్కువ సంఖ్యలో ఫోన్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అవి అమ్మకాలు జరపకపోతే భారీగా నష్టపోతుంటాయి. షియోమి ఇందుకు పూర్తిగా విరుద్ధం. డిమాండును బట్టి యూనిట్లను తయారుచేస్తుంది.

A Kindle-like business model
షియోమి కేవలం మొబైళ్లను మాత్రమే కాకుండా దానికి సంబంధించిన హార్డేవేర్, సాఫ్ట్‌వేర్ పార్టులను విక్రయిస్తుంది. తద్వారా కంపెనీ భారీ ఆదాయాలను కొల్లగొడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

International expansion
ప్రపంచవ్యాప్తంగా షియోమి ఇదే బిజినెస్ ఫాలో అవుతూ ముందుకు వెళుతోంది. అయితే కొన్ని కంపెనీలు ఒక్కో దేశంలో ఒక్కో విధమైన విధానంతో ఫాలో అవుతున్నారు. అది ఒక్కోసారి ఫెయిల్యూర్ అయి మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయని షియోమికి అటువంటి సమస్య లేదని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తయారీ ఖర్చు
చైనా అంటేనే లేబర్స్ కి పెట్టింది. పేరు. అక్కడ శ్రమదోపిడి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. మొబైల్ కి సంబంధించి అన్ని రకాల పార్టులను చైనాలో తయారుచేస్తూ ఉంటారు. ఇది కూడా షియోమికి బాగా కలిసివస్తోంది.


Click it and Unblock the Notifications








