మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

Written By:

ఇంటర్నెట్ అనేది మనందరి జీవితాల్లో ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాలం మనందరి జీవితాలను మరింత సరళతరం చేసేసింది.

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

ఓ ఇంటర్నెట్ కనెక్షన్‌ను సెటప్ చేసే క్రమంలో రకరకాల డైవర్‌లను ఆయా కంప్యూటర్‌లలో ఇన్‌స్టాల్ చేయవల్సి ఉంటుంది. ఇది కొంచం కష్టమైన ప్రక్రియే!. మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు వేరొక కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా డయల్-అప్ కనెక్షన్ ద్వారా మొబైల్ ఇంటర్నెట్‌నే పీసీలో యాక్సెస్ చేసుకునే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం...

Read More : పాత ఫోన్ ఇస్తే కొత్త మోటరోలా ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

ముందుగా మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోని Control Panel విభాగంలోకి వెళ్లి Network and Sharing మెనూ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 'Set up a new connection'పేరుతో ఓ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు Setup a new dial-up connection' పేరుతో మరో సబ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని పై క్లిక్ చేయండి.

Image Source : safetricks

 

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

ఇప్పుడు ఓపెన్ అయ్యే కొత్త సెట్టింగ్స్ విండోలో ఖచ్చితమైన సమాచారాన్ని ఫిల్ చేయండి. డయల్ - అప్ ఫోన్ నెంబర్ అనేది దేశాన్ని బట్టి ఉంటుంది. డీఫాల్ట్ నెంబర్ వచ్చే సరికి 99# లేదా 99***1#

Image Source : safetricks

 

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

మీ ISP కనెక్షన్ సెక్యూర్‌గా ఉన్నట్లయితే యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌ను సెట్టింగ్స్ విండోలో ఎంటర్ చేయండి. కనెక్షన్ సెక్యూర్‌గా లేకపోయినట్లయితే ఆ ఖాళీలను అలా వదిలేయండి. విండోలో ఆ తరువాత కనిపించే ఖాళీలో కనెక్షన్ నేమ్‌ను ఎంటర్ చేసి Connect ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Image Source : safetricks

 

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

ఫోన్ అండ్ మోడెమ్ సెట్టింగ్స్

కంట్రోల్ ప్యానల్‌లోని Phone and Modem ఆప్షన్‌ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ కంట్రీ లేదా ఏరియా కోడ్‌ను యాడ్ చేసిన OK బటన్ పై క్లిక్ చేయండి. మరోసారి Phone and Modem ఆప్షన్‌ను ఓపెన్ చేసి Modem Tabలోకి స్విచ్ అవ్వండి. మీ ఫోన్ అందుబాటులో ఉన్నట్లయితే పోర్ట్‌కు అటాచ్ చేసి కనెక్ట్ అయిన తరువాత సెలక్ట్ చేసుకుని Propertiesలోకి వెళ్లండి.

Image Source : safetricks

 

మొబైల్ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలోని Change Settings ఆప్షన్ పై క్లిక్ చేయండి. విండోను రీఫ్రెష్ చేసి అడ్వాన్సుడ్ సెట్టింగ్స్ టాబ్‌కు స్విచ్ అవ్వండి. ఇక్కడ కనిపించే Extra Initialization Command ఆప్షన్‌లోకి వెళ్లి మీ సర్వీస్ ప్రొవైడర్ అందించే Mobile-APNను ఎంటర్ చేయండి. కమాండ్ పేస్ట్ అయిన తరువాత సెట్టింగ్స్‌ను సేవ్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ ఇంటర్నెట్ పీసీలో యాక్సెస్ అవుతుంది.

Image Source : safetricks

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Tips Will Help You Use Mobile Internet On PC With Dial Up Modem!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot