ఐఫోన్ మ్యూజిక్ యాప్ నుంచి ‘యాపిల్ మ్యూజిక్’ను తొలగించటం ఎలా..?

By: BOMMU SIVANJANEYULU

ఐఓఎస్ ప్లాట్‌ఫామ్ పై మ్యూజిక్‌ను ఆస్వాదించాలనగానే ముందుగా మనుకు గుర్తుకు వచ్చేది యాపిల్ మ్యూజిక్ (Apple Music). యాడ్ ఫ్రీ మ్యూజిక్ సర్వీసుగా గుర్తింపుతెచ్చుకున్న యాపిల్ మ్యూజిక్‌ యాప్‌లో వివిధ విభాగాలకు సంబంధించి 4 కోట్లకు పైగా సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ మ్యజిక్ కంటెంట్‌ను అందించటంలో యాపిల్ మ్యూజిక్ ఓ నమ్మకమైన సర్వీసుగా గుర్తింపు తెచ్చుకుంది.

ఐఫోన్ మ్యూజిక్ యాప్ నుంచి ‘యాపిల్ మ్యూజిక్’ను తొలగించటం ఎలా..?

ఐఓఎస్ యూజర్లకు మొదటి మూడు నెలల పాటు ఉచితంగా అందుబాటులో ఉండే ఈ సర్వీస్, ఆ తరువాత నుంచి నెలవారీ చందాతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీన్ని భారంగా భావిస్తోన్న చాలా మంది యూజర్లు యాపిల్ మ్యూజిక్ యాప్‌ను తమ డివైస్ నుంచి పూర్తిగా తొలగించాలని చూస్తున్నారు.

ఇది పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికి టెంపరరీగా హైడ్ చేసుకునే వీలుంటుంది. అయితే ఈ ప్రొసీజర్ ఐఫోన్, ఐపోడ్ టచ్, ఐప్యాడ్ ఇంకా మ్యాక్ పీసీలలో మాత్రమే వర్క్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ 1 :

మందుగా మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఐపోడ్ టచ్‌లో సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2 :

సెట్టింగ్స్ యాప్ ఓపెన్ అయిన తరువాత, అందులో కనిపించే మ్యూజిక్ సెక్షన్‌లోకి నేవిగేట్ అవ్వండి.

స్టెప్ 3 :

మ్యూజిక్ సెక్షన్‌లో కనిపించే “Show Apple Music” స్విచ్‌ను అన్‌టిక్ చేసి ఆఫ్ పొజీషన్‌లోకి తీసుకురండి.

ఇలా చేయటం వల్ల యాపిల్ మ్యూజిక్ స్విచ్ డివైస్‌లో కనిపించదు. అయితే, ఆఫ్‌లైన్ లిస్టనింగ్ నిమిత్తం యాపిల్ మ్యూజిక్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న సాంగ్స్‌ను మాత్రం రిమూవ్ చేయటం కుదరదు. ఐక్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీ ఎనేబుల్ అయి ఉన్నంత కాలం వీటిని రిమూవ్ చేయటం కుదరదు. మ్యాక్ కంప్యూటర్‌లో యాపిల్ మ్యూజిక్‌ను తొలగించాలనకుంటున్నట్లయితే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి..

స్టెప్ 1 :

ముందుగా మీ మ్యాక్ పీసీలో ఐట్యూన్స్ యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2 :

ఐట్యూన్స్ మెనూ ఓపెన్ అయిన తరువాత అందులో కనిపించే 'ప్రిఫరెన్సెస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 3 :

జనరల్ ట్యాబ్ పై క్లిక్ చేసి “Show Apple Music” బాక్స్‌ను అన్‌చెక్ చేయండి.

ఐక్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీని డిసేబుల్ చేయటం ద్వారా ఆఫ్‌లైన్ ట్రాక్స్ అలానే యాపిల్ మ్యూజిక్ సాంగ్స్ మీ డివైస్ నుంచి పూర్తిగా రిమూవ్ కాబడతాయి. అయితే యాపిల్ మ్యూజిక్ ద్వారా ఐక్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీని టర్నాఫ్ చేయటం కుదరదు. దీనికి వేరే ప్రొసీజర్‌ను ఫాలో కావల్సి ఉంటుంది...

స్టెప్ 1 :

ముందుగా మీ ఐఓఎస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

స్టెప్ 2:

సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత అక్కడ కనిపించే మ్యూజిక్ సెక్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3 :

మ్యూజిక్ సెక్షన్‌లో కనిపించే 'iCloud Music Library’ స్విచ్‌ను అన్‌టిక్ చేసి ఆఫ్ పొజీషన్‌లోకి ఫ్లిప్ చేసినట్లయితే ఐక్లౌడ్ మ్యూజిక్ లైబ్రరీని డిసేబుల్ కాబడుతుంది.

ఇదే ప్రొసీజర్ మ్యాక్ పీసీలో చేయలనుకుంటున్నట్లయితే ఐట్యూన్స్ మెనూ ఓపెన్ అయిన తరువాత అందులో కనిపించే 'ప్రిఫరెన్సెస్’ను సెలక్ట్ చేసుకుని “iCloud Music Library”ని అన్‌చెక్ చేసినట్లయితే ఆప్షన్ డిసేబుల్ కాబడుతుంది. 

ఎరుపు రంగులో 'హానర్ 7 ఎక్స్', ప్రేమికులకు ప్రత్యేకం..

Read more about:
English summary
When it comes to enjoying music on the iOS platform, Apple Music plays a big role indeed. Even though it is impossible to get rid of it completely, you can temporarily hide most of Apple Music’s aspects.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot