ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం ప్రత్యేక ‘కాలర్ ఐడీ అప్లికేషన్’

Posted By:

ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం ప్రత్యేక ‘కాలర్ ఐడీ  అప్లికేషన్’
త్రెడ్ (Thread) పేరుతో సరికొత్త కాలర్ ఐడీ అప్లికేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌ల కోసం ఎదురుచూస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు ఈ అల్టిమేట్ కాలర్ ఐడీ అప్లికేషన్‌ను తమ హ్యాండ్‌సెట్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోన్ చేసిన కాలర్‌లకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీకు నెలక్రితం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడిన వ్యక్తి నుంచి ఓ కాల్ వచ్చింది. సదరు వ్యక్తిని మీరు సరిగా గుర్తించలేకపోయారు.

ఇదే సమయంలో మీ హ్యాండ్‌సెట్ త్రెడ్ అప్లికేషన్‌ను కలిగి ఉన్నట్లయితే సదరు కాలర్‌కు సంబంధించి అదనపు సమాచారంతో కూడిన కస్టమ్ స్ర్కీన్‌ మీ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే పై ప్రత్యక్షమవుతుంది. సదరు కస్టమ్ స్ర్కీన్ మీకు కాల్ చేసిన వ్యక్తికి సంబంధించి ట్విట్టర్,
ఫేస్‌బుక్ పోస్ట్‌లతో కూడిన సమాచారాన్ని మీకు గుర్తు చేస్తుంది. మీరు సదరు కాలర్‌తో తాజాగా జరిపిన చాటింగ్ వివరాలు సైతం కస్టమ స్ర్కీన్ పై ఉంటాయి. దీంతో మీరు తడబడకుండా కాల్‌ను కొనసాగించవచ్చు. ఔత్సాహికులు ఈ అప్లికేషన్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot