ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

Written By:

కొన్ని సందర్భాల్లో నా ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డ్రెయిన్ అయి పోతుంటుంది. అలా ఎందుకు జరుగుతుంది..? ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో ఒక్కోసారి నా ఫోన్ భయకరంగా హీటెక్కుతోంది. ఫోన్ పేలిపోతుందేమోన్న భయం కూడా వెంటాడుతోంది. అసలు ఈ హీటింగ్‌కు కారణాలేంటి..?, అసలు బ్యాటరీ ఎన్నేళ్లు పనిచేస్తుంది..? ఒక సంవత్సరమా లేక రెండు సంవత్సరాలా..? స్మార్ట్‌ఫోన్ కీలక కాంపోనెంట్‌లలో ఒకటైన బ్యాటరీ గురించి ఇలా అనేకమైన మిస్టీరియస్ ప్రశ్నలు అనేక పలువురిలో ఉదయిస్తూనే ఉన్నాయి.

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

బ్యాటరీ పనీతీరు అనేది ఫోన్ యూసేజ్, పరిసర ఉష్ణోగ్రత అలానే సెల్యులార్ సిగ్నల్ బలాన్ని బట్టి ఆధార పడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విధమైన సమస్యలను ఫేస్ చేస్తున్నవారు తమ ఫోన్ బ్యాటరీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ బ్యాటరీ విషయంలో ప్రతిఒక్కరు పాటించాల్సిన పలు ముఖ్యమైన చిట్కాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : le 1s Eco రికార్డ్, 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

మీరు వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. మీ ఫోన్ కు వేరొక కంపెనీ ఛార్జర్ ను ఉపయోగించటం వల్ల ఫోన్ హీటెక్కే ప్రమాదముంది. 

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

డామెజ్ అయిన బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని రీప్లేస్ చేయండి.

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో ఫోన్ మాట్లాడటం కాని, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వంటి పనులను చేయకండి. ఇవి చాలా ప్రమాదకరమైన అలవాట్లు.

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్‌ను తొలగించండి.

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

వేడి మీ ఫోన్‌కు ప్రధాన శత్రువు. కాబట్టి, మీ ఫోన్‌ను వేడి వాతావరణంలో ఛార్జ్ చేయకండి, చల్లటి ప్రదేశంలో ఉండేలా చూసుకోండి.

ఛార్జ్ అవుతోన్న ఫోన్‌తో జాగ్రత్త!

బ్యాటరీ సామర్థ్యాన్ని పరిశీలించకున్నతరువాతనే ఫోన్‌ను కొనుగోలు చేయండి. బ్రాండెడ్ ఫోన్ లకే మొదటి ప్రయారిటీ ఇవ్వండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to avoid damage to battery while charging phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot