ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఏదైనా సాధ్యమే.. ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో ప్లేబ్యాక్, కాలింగ్, టెక్స్టింగ్ ఇలా అనేకు పనులను స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏకకాలంలో నిర్వహించుకోవచ్చు. ఈ పనులన్ని నిర్వర్తించేందుక స్మార్ట్‌ఫోన్‌కు ముఖ్యంగా అవసరమైనది సమర్ధవంతమైన బ్యాటరీ . స్మార్ట్‌ఫోన్ యూజర్‌లను ప్రధానంగా వేధిస్తున్న సమస్య ‘బ్యాటరీ బ్యాకప్'. ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్ బ్యాటరీ పనితీరు పై ప్రధానంగా దృష్టిసారించాల్సి ఉంది. తన ఫోన్‌లోని బ్యాటరీ ఏఏ విభాగానికి ఎంతెంత శక్తిని సరఫరా చేస్తుంది, అందులో ఏది వృధాగా ఖర్చవుతుందనే వివరాలను యూజర్ తన స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పై తెలసుకోవచ్చు. తద్వారా బ్యాటరీ శక్తిని పొదుపుచేసుకోవచ్చు. ఆ విధానం ఏలాగో చూద్దాం...

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లయితే..?
మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ దిగువ భాగాన ఉన్న మెనూ బటన్‌ను క్లిక్ చేయండి.
అనంతరం సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లండి.
"About Phone" అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
బ్యాటరీ యూసేజ్ అనే లావాదేవీ పై క్లిక్ చేస్తే బ్యాటరీ వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్ ప్లే అవుతాయి.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెరగాలంటే..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా...?, బ్యాటరీ శక్తిని పొదుపు చేసుకునే మార్గాల కోసం ఆన్వేషిస్తున్నారా..?, ఇవిగోండి బ్యాటర్ బ్యాకప్‌ను పొదుపుచేసుకునే విలువైన మార్గాలు.......

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
పవర్ కంట్రోల్ అప్లికేషన్:
కొద్ది పాటి చోటను ఆక్రమించే ఈ అప్లికేషన్ హోమ్‌స్ర్కీన్ విడ్జెట్‌లాగా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ అవసరంలేని సమయాల్లో వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్ లను ఆఫ్ చేస్తుంది. అంతేకాదండోయ్ మీ స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను సైతం అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరుగుతుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌లను మార్చుకోండి:
మెయిల్ సెట్టింగ్ అప్లికేషన్‌ను సవరించటం వల్ల బ్యాటరీని పొదుపు చేసుకోవచ్చు. మెయిల్ వీక్షణ అలర్ట్‌ను నిమిషాల నుంచి గంటలకు అప్‌డేట్ చేస్తే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
ఫైన్-ట్యూన్ స్ర్కీన్ బ్రైట్‌నెస్:
స్ర్కీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవటం ద్వారా బ్యాటరీని మరింత ఆదా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్స్‌లోకి వెళ్టి డిస్‌ప్లే ఐకాన్‌ను ఎంపిక చేసి బ్రైట్‌నెస్‌ను తగ్గించుకుంటే సరిపోతుంది.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వాడకాన్ని చెక్ చేసుకోవటం ఏలా..?
స్మార్ట్ పవర్ అప్లికేషన్ సెట్టింగ్స్:
అవసరం మేరకు ఉపయోగపడే అప్లికుషన్‌లను మాత్రమే ఓపెన్ చేసుకోవటం మంచిది. అప్లికేషన్‌లు ఇతర డేటాను డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ను చార్ఝింగ్‌లో ఉంచటం మంచిది.


Click it and Unblock the Notifications








