ఫేస్‌బుక్‌ కామెంట్‌లను ఎడిట్ చేసేదెలా..?

|

ప్రఖ్యాత సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ 800 మిలియన్‌ల యాక్టివ్ యూజర్లతో విరాజిల్లుతోంది. ఈ సైట్‌లోని ప్రతి యూజర్‌కు సగటున 200మంది స్నేహితులు ఉంటారు. ఫేస్‌బుక్ ద్వారా రోజుకు కొన్ని లక్షలు సంభాషణలు చోటుచేసుకుంటాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తాజాగా ‘ఎడిట్ కామెంట్ ఫీచర్'ను లాంచ్ చేసింది.

 

ఈ ఫీచర్ అందుబాటులోకి రాకముందు ‘కామెంట్‌ను ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేది కాదు, డిలీట్ చేసి కొత్తది పోస్ట్ చెయ్యాల్సి వచ్చేది'. ఈ కొత్త అప్లికేషన్ రాకతో చేసిన కామెంట్‌లో ఏమైన అక్షరదోషాలు తలెత్తితే ఎడిట్ చేసి రీపోస్ట్ చేసుకోవచ్చు.

 
Tips to edit comments on Facebook

కామెంట్‌ను ఎడిట్ చేసుకునే విధానం:

- ముందగా మీరు చేసిన కామెంట్ దగ్గరికి వెళ్లండి.
- కామెంట్ పై కర్సర్ పెట్టిన వెంటనే కుడిభాగంలో పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది.
- పెన్సిల్ ఐకాన్‌ను క్లిక్ చేసిన వెంటనే ‘ఎడిట్ ఆర్ డిలిట్' ఆప్షన్ ప్రత్యక్షమవుతుంది.
- ఎడిట్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి.
- అక్షరదోషాలను సవరించి తిరిగి మీ కామెంట్‌ను రీపోస్ట్ చెయ్యండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X