మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

Posted By:

ఈ ఆధునిక యుగంలో అన్ని పనులను కంప్యూటర్లే చక్కబెట్టేస్తున్నాయి. పలు రకాల అవసరాల దృష్ట్యా కంప్యూటర్‌లకు గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. విద్యా.. వ్యాపారం.. వినోదం ఇలా అనేక విభాగాలలో పర్సనల్ కంప్యూటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. పలు రకాల అవసరాల నేపధ్యంలో ఇళ్లలో సైతం పర్సనల్ కంప్యూటర్‌లను వినియోగించుకుంటున్నారు. నేటి మన ప్రత్యేక శీర్షికలో భాగంగా పర్సనల్ కంప్యూటర్‌ను సురక్షితంగా ఏలా ఉపయోగించుకోవాలి అనే అంశం పై నిపుణులు చేసిన పలు సూచనలను తెలుసుకుందాం........

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

1.) విద్యుత్ కొరతతో మీ పీసీ మధ్య మధ్యలో ఆగిపోకుండా యూపీఎస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

2.) మీ పీసీకి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ రక్షణ తప్పనిసరిగా అవసరం. ఇన్స్‌స్టాల్ చేసుకున్న యాంటీ వైరస్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటుండాలి.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

3.) మీ వ్యక్తిగత కంప్యూటర్‌కు పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఈ చర్య ద్వారా మీరులేని సమయంలో మీ పీసీని వేరేవారు వినియోగించేందుకు ఆస్కారం ఉండదు.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

4.) మానిటర్, యూపీఎస్, సీపీయూ, కీబోర్డు ఇంకా మౌస్ లకు చమ్మ తాకిడి తగలకూడదు.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

5.) పీసీని తడిగుడ్డతో శుభ్రం చేయవద్దు. విద్యుత్ ప్రవహించే అవకాశముంది. పీసీని శుభ్రం చేసేందుకు కంప్యూటర్ లిక్విడ్ క్లీనింగ్ కిట్ ను మాత్రమే ఉపయోగించండి.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

6.) తరచూ కంప్యూటర్ రిస్టార్ట్ అవుతుంటే ర్యామ్ లో సమస్య ఉందని గుర్తించండి. సిస్టం తరచూ హ్యాంగ్ అవుతున్నట్లయితే ఫార్మాట్ చేయించండి.

మీ కంప్యూటర్ సురక్షితంగా ఉండాలంటే..?

7.) సీపీయూను ఓపెన్ చేసి ఉంచకండి. దీని వల్ల లోపలి భాగాలు దెబ్బతీనే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot