మీ ఫేస్‌బుక్, వాట్సాప్ అకౌంట్‌లను కాపాడుకోండిలా..?

మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ప్రూఫ్‌‌గా మార్చేందుకు ముఖ్యమైన సూచనలు..

|

వ్యక్తిగత సమచారాన్ని కలిగి ఉండే మన సోషల్ మీడియా అకౌంట్లకు భద్రత అనేది చాలా ముఖ్యం. డేటా సెక్యూరిటీ విషయంలో పరిస్థితి చేజారిపోయిన తరువాత ఆలిచించే కంటే ముందస్తుగా మేల్కొవటం ఎంత ఉత్తమం. మీ ఆన్‌లైన్ అకౌంట్‌లను పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ప్రూఫ్‌గా ఉంచుకునేందుకు పలు కీలక సూచనలు..

Read More : పెద్ద డిస్‌ప్లేతో లెనోవో ఫాబ్ 2 ఫోన్, ధర రూ.11,999

 లాగిన్ వెరిఫికేషన్

లాగిన్ వెరిఫికేషన్

మీ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించిన సెక్యూరిటీ మరింత కట్టుదిట్టంగా ఉండాలంటే, శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవటంతో పాటు లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను సెట్ చేసుకోండి. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే మీ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించిన సెట్టింగ్స్‌లోకి వెళ్లి Security & Privacy Settings ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకునేముందు, మీ ఈమెయిల్ ఐడీని కన్ఫర్మ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ ట్విట్టర్ అకౌంట్‌ను వేరొకరు యాక్సెస్ చేసుకునేందుకు సాధ్యపడదు.

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫేస్‌బుక్ యూజర్లకు..

ఫేస్‌బుక్ యూజర్లకు..

సెక్యూరిటీ పరంగా మీ అకౌంట్‌లను కట్టుదిట్టంగా ఉంచేందుకు ఫేస్‌బుక్ కూడా లాగిన్ వెరిఫికేషన్ తరహాలో ప్రైవసీ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ ఫేస్ బుక్ మరింత సురక్షితంగా ఉంటుంది.

వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి ఉంటే..?

వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి ఉంటే..?

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వేరొక డివైస్‌లో ఓపెన్ చేసి లాగ్ అవుట్ చేయటం మర్చిపాయారు. అయితే ఆ సెషన్‌ను రిమోట్ విధానం ద్వారా సైన్ అవుట్ చేయవచ్చు. అది ఏలా సాధ్యం అంటారా..? మీరు కాకుండా వేరొకరు వాడుతున్నట్లు తెలిస్తే ఆ యాక్టివిటీని ఎండ్ చేసేందుకు Settings -> Security -> 'Where You're Logged In' ఆప్షన్‌లోకి వెళితే సరిపోతుంది.

2-factor authentication

2-factor authentication

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి లాగిన్ అప్రూవల్స్‌ను సెట్ చేసుకోవటం ద్వారా మీ అకౌంట్ సెక్యూరిటీ పరంగా మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇందుకుగాను "2-factor authentication" సౌలభ్యతను ఫేస్ బుక్ అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు Settings -> Security -> 'Login Approvals'లోకి వెళ్లండి.

ఎంట్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను

ఎంట్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను

మీ చాట్‌లను మరింత సెక్యూర్‌గా ఉంచేందుకు ఫేస్‌బుక్ ఇప్పటికే ఎంట్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగించుకుంటోంది. ఈ సౌలభ్యతను మీ వాట్సాప్ అకౌంట్ లకు కల్పించటం ద్వారా వాట్సాప్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా మీ చాట్ లను చూడాలేరు.

జీమెయిల్ సెక్యూరిటీ విషయంలో..

జీమెయిల్ సెక్యూరిటీ విషయంలో..

మీ జీమెయిల్ అకౌంట్‌ను మరింత సెక్యూర్‌గా ఉంచుకునే క్రమంలో "2-factor authentication"ను ఉపయోగించుకోవటం చాలా ఉత్తమం. ఒక వేళ మీ జీమెయిల్ అకౌంట్‌ను వేరొకరు ఉపయోగిస్తున్నట్లయితే మెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి account activityని చెక్ చేసినట్లయితే, మీ అకౌంట్‌ను ఎవరు యాక్సిస్ చేసుకుంటున్నారనేది తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Tips to protect yourself on WhatsApp, Facebook and more. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X