మీ ఫోన్‌కు వైరస్ బెడద తప్పాలంటే..?

మీ స్మార్ట్‌పోన్ వైరస్ బారిన పడి నెమ్మదైన పనితీరును కనబరుస్తుందా...?, మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. మరిన్ని సూచనలు..........
స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసకోండి: వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. ఖచ్చితమైన యాంటీ -వైరస్ ప్రోగ్రామ్ వాడండి: వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌లు ముఖ్యం: మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంట్రీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది.
కంప్యూటర్ వేగం మందగించిదా..?
మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు...
అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి:
ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి:
పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి.
రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి:
మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది.
ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి:
పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది.
అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి:
విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నవీరణలు పీసీ పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.


Click it and Unblock the Notifications








