మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

|

మీ స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండాలంటే వైరస్‌ల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. మాల్వేర్స్, ట్రాజాన్స్ వంటి వైరస్‌లు ఫోన్ పనితీరును పూర్తిగా ధ్వంసం చేసేస్తాయి. ఈ విధమైన వైరస్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే వైరస్ రిమూవల్ సాఫ్ట్‌వేర్‌లను తప్పనిసరిగా ఇన్స్‌స్టాల్ చేసుకోవాలి. వైరస్ నుంచి ఉపశమనం పొందే తక్షణమార్గంగా స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లను రిస్టోర్ చేసుకోండి. వైరస్ నుంచి రక్షణ పొందే క్రమంలో మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నయాంటీ వైరస్ ప్రోగ్రామ్ ఖచ్చితమైన పనితీరును కనబర్చేదిగా ఉండాలి. మీ ఫోన్‌లో నిక్షిప్తం చేయబడి ఉన్న యాంట్రీ వైరస్ ప్రోగ్రామ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మంచిది. మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉంచే పలు చిట్కాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు........

 మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

1.) ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి:

నేటి తరం స్మార్ట్‌ఫోన్ పీసీలు డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటున్నాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా మెయిల్ చెక్ చేసుకునే సందర్భంలో అప్రమత్తత వహించటం మంచిది. ముఖ్యంగా ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి లేకుంటే అనవసర వైరస్‌లు మీ డివైజ్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి.

 

 మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

2.) యూఆర్ఎల్స్ విషయంలో జాగ్రత్త:

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

 

 మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

3.) అప్లికేషన్‌ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించండి:

మీ ఫోన్‌కు సంబంధించి అప్లికేషన్‌లను సదురు ఫోన్‌కు సంబంధించిన అప్లికేషన్ స్టోర్ ద్వారా మాత్రమే ఇన్స్‌స్టాల్ చేసుకోండి. కొత్త పంథాను అనుసరిస్తున్న హ్యాకర్లు వైరస్‌లతో కూడిన నకిలీ అప్లికేషన్‌లను నెట్‌లో సృష్టిస్తున్నారు.

 

 మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!


4.) మీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్‌ను స్విచ్‌ఆన్ చేసినపుడు ఇన్విజబుల్ మోడ్‌లో ఉంచండి.

 మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే!

5.) మొబైల్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచండి:
అనవసరమైన డేటాను తొలగించి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుకోండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X