ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డుకు Apply చేయటం ఎలా..?

|

18 సంవత్సరాలు నిండిన తమ పౌరులకు తప్పనిసరిగా జారీ చేయవల్సిన ధృవీకరణ పత్రాల్లో ఓటర్ ఐడీ ఒకటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్ ఐడీ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది లైసెన్స్ లాంటింది.

ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డుకు Apply చేయటం ఎలా..?

Read More : వారం రోజుల్లో Motorola కొత్త ఫోన్.. రూ.9,000లోపే

అంతేకాదు, అనేక లీగల్ డాక్యుమెంటేషన్‌లలో ఓటర్ ఐడీ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు ఓటు గుర్తింపు కార్డును పొందాలంటే కనీసం 6 నెలల సమయం పట్టేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాణం, ఓటర్ ఐడీ జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేసింది. ఓటు గుర్తింపు కార్డుకు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేయటం ద్వారా బోలెండత సమయం ఆదా అవటంతో పాటు ఇతర బెనిఫిట్లను కూడా పొందవచ్చు.

Read More : మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

#1

#1

భారత ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం ఒక్కో పౌరుడు ఒక ఓటర్ ఐడీని మాత్రామే కలిగి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

#2

#2

ధరఖాస్తు చేసుకున్న ఓటర్ ఐడీ నేరుగా వ్యక్తి చిరునామాకే డెలివరీ చేయబడుతుంది. ఆన్‌లైన్ ప్రాసెస్‌లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకువటం ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటు గుర్తింపు కార్డును పొందవచ్చు.

#3

#3

ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో ఈ ప్రక్రియకు 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ఆన్‌లైన్‌లో ఓటు గుర్తింపు కార్డుకు ధరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది...

#4
 

#4

స్టెప్ 1
ముందుగా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లింక్ అడ్రస్ :

 

 

#5

#5

స్టెప్ 2

వెబ్‌సైట్ హోమ్ పేజీలో కనిపించే Apply online for Registraion of new Voter అనే టాబ్ పై క్లిక్ చేయండి.

 

#6

#6

స్టెప్ 3

Form 6తో కూడిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్‌లో మీ రాష్ట్రం, పార్లమెంటరీ నియోజికవర్గ పరిధి, పేరు, పుట్టిన తేదీ, జన్మ స్థలం వివరాలను పొందుపరచటంతో పాటు ఫోటో తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అ‌ప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది.

 

#7

#7

స్టెప్ 4

Form 6ను పూర్తిగా ఫిల్ చేసిన తరువాత ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని submit బటన్ పై ప్రెస్ చేయండి.

 

#8

#8

స్టెప్ 5

మీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, అప్లికేషన్‌లో మీరు వెల్లడించిన ఈ-మెయిల్ ఐడీకి, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నుంచి ఓ లింక్ అందుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఓటర్ ఐడీ పేజీకి రీడైరక్ట్ అవుతారు.

 

#9

#9

స్టెప్ 6

ఈ లింక్ ద్వారా మీ ఓటర్ ఐడీ సంబంధించిన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
Tips to Apply for VOTER ID CARD through Online. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X