జియో 4జీ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

తన వెల్‌కమ్ ఆఫర్‌తో ఇండియన్ టెలికం మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన రిలయన్స్ Jio తాజాగా న్యూ ఇయర్ ఆఫర్‌ను లాంచ్ చేసి మరో రికార్డ్ నెలకొల్పింది.

జియో 4జీ ఇంటర్నెట్‌ను ల్యాప్‌టాప్‌లో వాడుకోవటం ఎలా..?

న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా మార్చి 31 వరకు జియో సేవలను ఉచితంగా ఉపయోగించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో కొన్ని సులువైన పద్ధతులను అనుసరించిటం ద్వారా జియో జిమ్ యూజర్లు, తమ ఫోన్ ఆఫర్ చేస్తున్న 4జీ ఇంటర్నెట్‌ను కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కు షేర్ చేసుకుని హైక్వాలిటీ బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ వై-ఫై కనెక్టువిటీ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లయితే స్మార్ట్‌ఫోన్ ద్వారా హాట్‌స్పాట్‌ను క్రియేట్ చేసి ఫోన్ ఇంటర్నెట్‌ను పీసీలోకి షేర్ చేసుకోవచ్చు. చాలా వరకు డెస్క్‌టాప్ కంప్యూటర్లు వై-ఫైను సపోర్ట్ చేయవు. కాబట్టి ల్యాప్‌టాప్‌లలో మాత్రమే, ఈ స్టెప్ వర్క్ అవుట్ అవుతుంది.

స్టెప్ 2

USB Tethering విధానం ద్వారా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. USB Tethering ఆఫ్షన్ ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో USB Tethering ఆఫ్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే.? Settings > More > Tethering and portable hotspotsలోకి వెళ్లి USB Tethering ఆఫ్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

యూఎస్బీ డాంగిల్ ఆధారంగా జియో 4జీ ఇంటర్నెట్‌ను మీ పీసీ లేదా ల్యాప్‌టాప్‌లో వాడుకోవచ్చు. ముందుగా మీ జియో సిమ్ కార్డ్‌ను డాంగిల్‌లో ఇన్సర్ట్ చేసి మీ కంప్యూటింగ్ డివైస్‌కు కనెక్ట్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 5

మీరు వాడుతన్న డాంగిల్ ఖచ్చితంగాజియో 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. ముందుగా సిమ్ కార్డ్‌ను ఆ డాంగిల్‌లో ఇన్సర్ట్ చేయండి. తదుపరి చర్యలో భాగంగా ఆ డాంగిల్‌ను పీసీ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసి కనెక్షన్‌ను Establish చేస్తే చాలు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to Connect Your Laptop With Jio 4G Internet. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot