ఇలా చేస్తే, మీ ఇంటర్నెట్ స్పీడ్ వెంటనే పెరిగిపోతుంది

సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్‌ను డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్ ఆధారంగా లెక్కిస్తుంటాం. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఒక కొత్త యూజర్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తరువాత యూజర్ ఎంపిక చేసుకున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్యాక్‌లను బట్టి గరిష్ట అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగంతో కూడిన ఇంటర్నెట్ డేటాను అందించటం జరుగుతుంది.

Read More : వర్షంలో ఫోన్ తీసుకువెళుతున్నారా..?

ఇలా చేస్తే, మీ ఇంటర్నెట్ స్పీడ్ వెంటనే పెరిగిపోతుంది

ఉదాహరణకు మీరు మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో 1 ఎంబీపీస్ గరిష్ట స్పీడ్‌తో కూడిన ఇంటర్నెట్ డేటా ప్యాక్‌ను యాక్టివేట్ చేసకున్నారు. అయితే, ఆ స్పీడ్ మీకు సంతృప్తినివ్వటం లేదు. మరో ప్యాక్‌కు యాక్టివేట్ అయితే తప్ప మీకు ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకునే ఛాన్స్ లేదు.

Read More : మీకు మెయిల్ అకౌంట్ ఉందా..? ఇవి తప్పక తెలుసుకోండి

ఇలా చేస్తే, మీ ఇంటర్నెట్ స్పీడ్ వెంటనే పెరిగిపోతుంది

మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు. టెక్నాలజీని అప్‌టు‌డేట్‌గా ఉంచుకుంటూ ఏ విధమైన నిబంధనలు ఉల్లంఘించకుండా మీ సర్వీస్ ప్యాక్ పరిధిలోనే వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్వాదించేందుకు పలు సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

వైర్‌లెస్ ఇంటర్నెట్‌కు బదులుగా Ethernet cable ద్వారా ఇంటర్నెట్‌ను పొందటం వల్ల మీ డేటా స్పీడ్స్ మరింత పెరిగే అవకాశముంది.

టిప్ 2

మీ Routerను అప్‌గ్రేడ్ చేసుకోవటం వల్ల డేటా స్పీడ్స్‌ను మరింత పెంచుకోవచ్చు. పాత కాలం Routers అవుట్‌డేటెడ్ కాంపోనెంట్స్‌ను కలిగి ఉండటం చేత ఇంటర్నెట్‌ను వేగవంతంగా యాక్సెస్ చేసుకోలేవు.

టిప్ 3

మన్నికైన మోడెమ్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్స్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 4

మోడెమ్ అలానే రౌటర్ ఫ్రీక్వెన్సీని రీబూట్ చేయటం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 5

ఒకవేళ మీరు పాత కంప్యూటర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే మీ డివైస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేయండి. అవుట్‌డేటెడ్ హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఇంటర్నెట్ వేగాన్ని పూర్తిగా తగ్గించివేసే అవకాశముంది. కాంపోనెంట్స్ మార్చుకోవటం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్స్‌ను పెంచుకోవచ్చు.

టిప్ 6

వైర్‌లెస్ ఇంటర్నెట్ లోకేషన్‌ను మార్చటం ద్వారా మీ డేటా స్పీడ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. వైర్‌లెస్ రూటర్‌కు దగ్గరగా మీ డివైస్‌ను ఉంచే ప్రయత్నం చేసినట్లయితే సిగ్నల్ బలం మరింత పెరిగి డేటా వేగం మరింత పెరిగే అవకాశముంది.

టిప్ 7

మీ రూటర్ , మోడెమ్ , కంప్యూటర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.

టిప్ 8

మీ డివైస్‌లో మీకు తెలియకుండా బ్యాక్ గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా డేటా వేగాన్ని పెంచుకోవచ్చు.

టిప్ 9

యాంటీ వైరస్ అలానే యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌లను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్‍‌‌ను పెంచుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to double your internet speed. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot