ఫోల్డర్స్‌ను సీక్రెట్‌గా ఉంచటం ఎలా..?

మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్ వేరొకరికి కనిపించకూడదా అయితే ఇలా చేయండి. డెస్క్‌టాప్ పై ఉన్న ముఖ్యమైన ఫైల్ లేదా ఫోల్డర్ భద్రపరుచుకోవాలనుకుంటే, సదురు ఫైల్ లేదా ఫోల్డర్ పై మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ప్రోపర్టీస్ విండోలో హిడెన్(Hidden) అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసిన అప్లై (Apply)అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.

Read More : రూ.299కే నెలంతా ఉచిత కాల్స్, 1జీబి 4జీ ఇంటర్నెట్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్..

ఇలా చేయటం ద్వారా మీరు దాచాలనుకన్న ఫైల్ లేదా ఫోల్డర్ హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ జాబితాలోకి చేరిపోతుంది. ఇలా దాచుకున్న ఫైల్‌ను తిరిగి చూసుకోవాలంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి ‘షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే హిడెన్ కాబడిన ఫైల్ లేదా ఫోల్డర్ ఓపెన్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డు నాట్ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్

మరలా ఆ ఫైల్ లేదా ఫోల్డర్‌ను హిడెన్ చేయాలనుకుంటే స్టార్ట్ మెనూలోకి ప్రవేశించి కంట్రోల్ ప్యానల్ విభాగాన్ని ఓపెన్ చేసి ఫోల్డర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఫోల్డర్ విండోలోని వ్యూ (view) ఐకాన్ పై క్లిక్ చేసి ‘డు నాట్ షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్'

అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసినట్లయితే సంబంధిత ఫైల్ లేదా ఫోల్డర్ డెస్కటాప్ పై మాయమైపోతుంది.

 

ఒక్కో ఫోల్డర్‌కు ఒక్కో రంగు..

సాధారణంగా మన పీసీలో ఫైళ్లను భద్రపరుచుకునే ‘ఫోల్డర్' కొన్ని సంవత్సరాల కాలంగా పసుపురంగులోనే కనిపిస్తోంది. ఫోల్డర్‌లకు సంబంధించి పరిమాణం ఇంకా ఆకారంలో మార్పులు వచ్చినప్పటికి రంగులో మాత్రం ఏ మార్పు రాలేదు. పీసీలో కనిపించే వందల ఫోల్డర్లు ఒకే రంగును కలిగి ఉండటంతో ముఖ్యమైన ఫోల్డర్‌ను వెతికిపట్టుకోవటం చాలా కష్టమవుతోంది.

Folder Colorizer

ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను ఎంచుకునే వెలసబాటును కల్పించినట్లయితే వాటిని వెతుక్కునే బెడద తప్పుతుంది. ఇదే తరహా సౌలభ్యత విండోస్ ఆధారిత పీసీలకు అందుబాటులోకి వచ్చింది. ఫోల్డర్ కలరైజర్ (Folder Colorizer) అనే అప్లికేషన్‌ను విండోస్ పీసీలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఫోల్డర్ ఐకాన్‌లకు వివిధ రంగులను సెట్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Tips to Hide a Folder or File On Your Desktop. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting