క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ పెంచడం ఎలా?

|

ఇప్పుడున్న కాలంలో జాబ్ మరియు వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరు తమ అవసరాల కోసం మరియు షాపింగులు చేయడానికి వారి వద్ద బ్యాంక్ యొక్క డెబిట్ కార్డు కాదని క్రెడిట్ కార్డును వినియోగిస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్న ప్రతి 100 మందిలో 60 మందికి పైగా క్రెడిట్ కార్డును వాడుతున్నారు. ఇప్పుడు కొద్దిగా అధిక మొత్తంలో సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు క్రెడిట్ కార్డును వాడుతున్నారు.

క్రెడిట్ కార్డు
 

క్రెడిట్ కార్డును షాపింగ్ కోసం మరియు ఏవైనా బిల్లులను చెల్లించడానికి ఉపయోగిస్తే కనుక ఒకొక్క సారి క్యాష్ బ్యాక్ లు కూడా లబిస్తాయి. అలాగే ఆన్లైన్ షాపింగ్ కోసం EMI పద్దతులలో చెల్లించడానికి కూడా ఈ కార్డు బాగా ఉపయోగపడుతుంది. అందుకోసం చాలా మంది వీటిని తీసుకోవడనికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

జియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలుజియో సెట్-టాప్ బాక్స్‌ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలు

క్రెడిట్ కార్డు

ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలంటే అనేక షరతులుండేవి. కానీ ఇప్పుడు ప్రతి బ్యాంకు ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డు ఉంటే సరిపోదు అది మీ అవసరాలకు తగ్గ లిమిట్ ను అందిస్తున్నదో లేదో చూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువగా ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో కొద్దిగా ఇబ్బందులు పడుతుంటారు. మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ తక్కువగా ఉందా? అయితే క్రెడిట్ యొక్క లిమిట్ ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆదాయం

బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఇచ్చేప్పుడు మీ యొక్క ఆదాయం, జాబ్, రీపేమెంట్ ఎలా చేస్తారు, క్రెడిట్ స్కోర్ ఎంత, ఎలా ఖర్చు చేస్తుంటారు అన్న అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తాయి. మొదటిసారి క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు లిమిట్ తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత ఖర్చు చేసి తిరిగి కట్టే ట్రాక్ రికార్డ్‌ను బట్టి క్రెడిట్ లిమిట్ పెంచుతుంటాయి. మీ యొక్క ఖర్చులు అధికంగా ఉంటే కనుక మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిగా మీరే స్వయంగా బ్యాంకును సంప్రదించి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరగడానికి ఏఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి.

అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్అన్‌లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

కస్టమర్ కేర్‌ను సంప్రదించడం
 

కస్టమర్ కేర్‌ను సంప్రదించడం

రెండవ పద్ధతి కస్టమర్ కేర్‌ను సంప్రదించడం. ఇందుకోసం బ్యాంకు యొక్క కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ యొక్క అన్ని వివరాలు చెప్పి క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి గల అవకాశాలను అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం పెరిగినట్టైతే అందుకు తగ్గ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వాటితో పాటు సాలరీ స్లిప్స్, ఫామ్ 16 లాంటి డాక్యుమెంట్స్ అందించవలసి ఉంటుంది. వాటి ఆధారంగా మీ క్రెడిట్ లిమిట్ పెంచడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.

ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడం

ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవడం

మీ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ పెరిగే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ విభాగాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు వాడుతున్న బ్యాంక్ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ సెక్షన్‌లోకి వెళ్లి అందులో క్రెడిట్ యొక్క లిమిట్‌ను పెంచే అవకాశం ఉందేమో కనుగొనవచ్చు. ఒకవేళ క్రెడిట్ లిమిట్ పెంచుకునేందుకు తగిన అర్హతలు ఉంటే కనుక దానికి తగ్గ నియమనిబంధనలన్నీ చదివి తెలుసుకోవాలి. ఏవైనా డాక్యుమెంట్స్ అవసరమైతే సమర్పించి క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు.

సకాలంలో బిల్లులు చెల్లించడం

సకాలంలో బిల్లులు చెల్లించడం

మీరు క్రెడిట్ కార్డ్ సరిగ్గా వాడుతూ ఉండి వాటి యొక్క బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నటైతే బ్యాంకులే కొంతకాలం తర్వాత క్రెడిట్ లిమిట్ పెంచేందుకు ఆఫర్ ను ప్రకటిస్తాయి. దాని కోసం ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా బ్యాంకులు మిమ్మల్ని సంప్రదిస్తాయి. ఆ సమయంలో మీ క్రెడిట్ లిమిట్ పెంచడం అవసరం అనుకుంటే వారి యొక్క ఆఫర్ ను యాక్సెప్ట్ చేయొచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?ఆన్‌లైన్‌ ద్వారా ఇ-పాన్ పొందడం ఎలా?

క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడేషన్

క్రెడిట్ కార్డ్ అప్‌గ్రేడేషన్

ప్రస్తుతం మీరు వాడుతున్న కార్డుపై క్రెడిట్ లిమిట్ పెరిగే ఛాన్స్ లేదంటే మీరు కొత్త కార్డ్ తీసుకోవడం ద్వారా క్రెడిట్ లిమిట్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్యాంక్‌లో కార్డ్ అప్‌గ్రేడేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్న కార్డుకన్నా కాస్త బెటర్ కార్డ్ ఎంచుకోవడం ద్వారా లిమిట్ పెరుగుతుంది. ఈ కార్డ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా పెరుగుతాయి. అయితే యాన్యువల్ ఫీజు కూడా కాస్త పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఇతర బ్యాంకు కార్డులు వాడటం

ఇతర బ్యాంకు కార్డులు వాడటం

మీరు ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్టైతే ఇతర బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు సులువుగా మంజూరు చేస్తుంటాయి. అప్పటికే మీ వద్ద ఒక కార్డ్ ఉంది కాబట్టి మరో కార్డ్ ఇచ్చేందుకు పెద్దగా అడ్డంకులేమీ ఉండవు. ఇతర బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డుల ఆధారంగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ మీకు ఎక్కువ లిమిట్ వస్తుందనుకుంటే కొత్త కార్డ్ తీసుకోవచ్చు. అయితే లిమిట్ విషయమై ముందే బ్యాంకు ప్రతినిధులతో హామీ తీసుకోవాలి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tips to Increase Credit Card Limits in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X