డౌన్‌లోడ్ స్పీడ్ పెంచుకునేందుకు చిట్కాలు

హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు. డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు…
ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.
డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది.
అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.
డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.


Click it and Unblock the Notifications








