కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

బ్యాటరీ పరిమాణంతో పాటు, ప్రాసెసింగ్ పవర్‌ను రోజురోజుకు పెంచుకుంటూ పోవటంతో స్మార్ట్‌ఫోన్‌లు క్షణాల వ్యవధిలోని ఓవర్ హీట్ అయిపోతున్నాయి.

కొత్త ఫోన్‌లతో జాగ్రత్త.. ఓవర్ హీట్ అవుతున్నాయ్!

ముఖ్యంగా ఈ ఓవర్ హీటింగ్ సమస్య అనేది ఫోన్ ఛార్జ్ అవుతోన్న సమయంలో, వీడియోలను రికార్డ్ చేస్తున్న సమయంలో లేకుంటే హెవీ యాప్‌లను వాడుతోన్న సమయంలో తలెత్తుతోంది. ఈ మధ్య లాంచ్ అయిన కొత్త ఫోన్‌లలో ఓవర్ హీటింగ్ సమస్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవర్ హీటింగ్ బెడద నుంచి మీ ఫోన్‌ను రక్షించుకునేందకు పలు ముఖ్యమైన చిట్కాలు..

Read More : ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. సంవత్సరం పాటు ఉచితం?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పొద్దస్తుమానం ప్రొటెక్షన్ కేస్‌లో ఉంచటం వల్ల

ఫోన్‌ను పొద్దస్తుమానం ప్రొటెక్షన్ కేస్‌లో ఉంచటం వల్ల, ఫోన్ నుంచి విడుదలైన వేడి బయటకు వెళ్లేందుకు ఆస్కారం ఉండదు. కాబట్టి, అప్పుడప్పుడు ఫోన్ కు ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ కవర్ ను తొలగించటం ద్వారా వేడి బయటకు పోయే ఆస్కారం ఉంటుంది.

అది సురక్షితమైన పద్ధతి కాదు

చాలా మంది తమ ఫోన్‌లను మంచం లేదా సోఫా మీద ఉంచి ఛార్జ్ చేస్తుంటారు. ఇది సురక్షితమైన పద్ధతి కాదు. పరుపు లేదా సోఫోలో ఉండే దూది లాంటి పదార్థం వేడిని త్వరగా గ్రహించిన మంటలను వ్యాప్త్తి చేసే అవకాశముంది. కాబట్టి, ఫోన్‌ను బల్లా లేదా చదునైన ప్రదేశంలో ఉంచి ఛార్జ్ చేయటం మంచిది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాత్రి సమయాల్లో...

చాలా మంది రాత్రి సమయాల్లో తమ ఫోన్‌లను ఛార్జింగ్ సాకెట్‌‌కు ఉంచేసి నిద్రపోతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంటుంది. ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అవ్వాగానే సాకేట్ నుంచి ఫోన్ ఛార్జర్‌ను వేరు చేయటం మంచిది.

గంటల కొద్ది విశ్రాంతి లేకుండా..

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

వాటిని డిసేబుల్ చేయటం ద్వారా

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్ ను తగ్గించుకోవచ్చు. ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి

వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది. ఫోన్‌లో ఎక్కువ సేపే గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.

పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..?

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో..

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌..

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to prevent smartphones from overheating. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot