Home
How to

డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

ప్రతీ ఆండ్రాయిడ్ పోన్ మినీ యూఎస్బీ వ్యవస్థను కలిగి ఉంటుంది.

By Sivanjaneyulu Bommu

ఫోన్‌లు క్రిందిపడి డిస్‌ప్లేలు పగలిపోవటమనేది సర్వసాధరణంగా చోటుచేసుకునే విషయమే. స్మార్ట్‌ఫోన్‌లలో డిస్‌ప్లే ధ్వంసమైతే టచ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో నిస్సత్తువుగా మారిన స్మార్ట్‌ఫోన్‌ను అలా వదిలేయకుండా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకునే ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : జియో యూజర్లకు మరో ఆఫర్, ఏకంగా 810జీబి డేటా

USB OTG...

USB OTG...

క్రిందపడిన మీ ఫోన్‌లో టచ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని డిస్‌ప్లే కాస్తో కూస్తో కనిపించే విధంగా ఉన్నట్లయితే మీ ఫోన్‌కు యూఎస్బీ ఆన్ ద గో కేబుల్ సహాయంతో మౌస్‌ను కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. USB OTG స్పెసిఫికేషన్ ద్వారా మొబైల్ ఫోన్‌లను ఇతర డివైస్‌లకు సులువుగా కనెక్ట్ చేసుకోవచ్చు.

 మినీ యూఎస్బీ పోర్ట్ ద్వారా...

మినీ యూఎస్బీ పోర్ట్ ద్వారా...

ప్రతీ ఆండ్రాయిడ్ పోన్ మినీ యూఎస్బీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పోర్ట్ సహాయంతో యూఎస్బీ సౌకర్యం ఉన్న మౌస్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. మౌస్.. ఫోన్‌కు కనెక్ట్ అయిన వెంటనే డివైస్‌ను అన్‌లాక్ చేయవచ్చు. ఫోన్ అన్‌లాక్ అయిన వెంటనే డివైస్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి ఫోన్‌లోని డేటాను రికవర్ చేయండి.

స్ర్కీన్ పూర్తిగా ఆఫ్ అయిపోయిన ఫోన్‌లో...

స్ర్కీన్ పూర్తిగా ఆఫ్ అయిపోయిన ఫోన్‌లో...

స్ర్కీన్ పూర్తిగా ఆఫ్ అయిపోయిన ఫోన్‌లో డేటాను రికవర్ చేయలంటే మీకు VNC ప్రోగ్రామ్ అనేది ఎంతో అవసరం. ఇటువంటి ప్రోగ్రామ్స్ మార్కెట్లో ఇబ్బిడి ముబ్బిడిగా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా సంబంధిత ఫోన్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌‍ఫేస్‌ను కంప్యూటర్‌లోకి తీసుకువచ్చి కంట్రోల్ చేయవచ్చు.

ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే...

ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే...

ఈ మొత్తం ప్రాసెస్ జరగాలంటే ముందుగా ఎంపిక చేసుకున్న ప్రోగ్రామ్‌ను మీ పీసీలో ఆ తరువాత స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఫీచర్లు అదనంగా. మీ అవసరాన్ని బట్టి ప్రోగ్రామ్‌‌ను ఎంపిక చేసుకోవటం మంచిది.

రిపేర్ షాప్‌కు వెళ్లాల్సిందే..

రిపేర్ షాప్‌కు వెళ్లాల్సిందే..

పైన సూచించిన చిట్కాలను పాటించినప్పటికి  డేటా రికవరీ సాధ్యమవని పక్షంలో మంచి రిపేర్ షాప్‌కు వెళ్లి డేటాను రికవర్ చేసుకుండి. ఈ ప్రాసెస్ కొంచం ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

Best Mobiles in India

English summary
Tips to Recover Data from Broken or Damaged Android Phone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X