Bloatwareతో సెక్యూరిటీ రిస్క్స్, తొలగించటం సులువే..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న అన్ని రకాల డివైస్‌లకు Bloatware నుంచి సెక్యూరిటీ రిస్క్స్ పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న అన్ని రకాల డివైస్‌లకు Bloatware నుంచి సెక్యూరిటీ రిస్క్స్ పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి Bloatware అనేది ముందుగా మీ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed యాప్స్ ద్వారా ప్రవేశిస్తుంది. దీని ద్వారానే హ్యాకర్లు తాము సృష్టించిన వైరస్‌లను ఫోన్‌లలోకి వ్యాపింపజేసే వీలుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పేరుకుపోయి ఉన్న Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు...

developer optionను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా..
ఫోన్‌లో ముందుగానే నిక్షిప్తమై ఉన్న కొన్ని స్టాక్ యాప్స్‌ను మీరు మాన్యువల్‌గా రిమూవ్ చేయటం సాధ్యపడదు. కాబట్టి, ముందుగా ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ టు స్టెప్ గైడ్...
ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు.

స్టెప్ టు స్టెప్ గైడ్...
యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో Pre-Installed Appsను మార్క్ చేసుకుని apply బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

System App Remover అనే యాప్ ద్వారా..
రూట్ చేయబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో Bloatware యాప్స్ ను తొలగించాలనుకుంటున్నట్లయితే ముందుగా System App Remover అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అయిన System App Remover యాప్‌ను ఫోన్ లో లాంచ్ చేయండి. యాప్ లాంచ్ అయిన తరువాత మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న యాప్ ను సెలక్ట్ చేసుకుని ‘Uninstall' పై టాప్ చేయండి. ఈ విధంగా రూట్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించవచ్చు.

ES File Explorer మరో చక్కటి ఆప్షన్..
మరో ఆప్షన్‌లో భాగంగా ES File Explorer ద్వారా Bloatware యాప్స్‌ను రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా ES File Explorer అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ లాంచ్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై కనిపించే మెనూను ఓపెన్ చేసి ‘App' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న అన్ని యాప్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో అవసరం లేని యాప్‌లను సెలక్ట్ చేసుకుని ‘ట్రాష్ క్యాన్' ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే అవి పూర్తిగా డిలీట్ కాబడుతాయి.


Click it and Unblock the Notifications








