మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

Written By:

ఆండ్రాయిడ్, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మనందరికి తెలుసు. మంచి ఉన్న చోటే చెడు కూడా పొంచి ఉన్నట్లు, ఆండ్రాయిడ్ ఫోన్‌ల వల్ల ఎంతైతే ఉపయోగాలు ఉన్నాయో అంతే సమస్యలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది మాల్వేర్ సమస్య.

 మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

యాప్స్ మాటున ఫోన్‌లలోకి చేరి విధ్వంసం సృష్టించే మాల్వేర్లు ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఫోన్ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో కొన్ని సందర్బాల్లో యూజర్ పర్మిషన్‌తో పని లేకుండానే కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ అయిపోతుంటాయి.

Read More : భారీ ఆఫర్లకు తెరతీసిన ఫ్లిప్‌కార్ట్ సేల్

 మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

వీటి పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే ఫోన్‌లో యాప్ లోడ్ హెవీగా పెరిగి, ఆ ఒత్తిడి ర్యామ్‌ పై పడి ఫోన్‌ ప్రాసెసింగ్‌ వేగం పూర్తిగా మందగించే ప్రమాదముంది. కాబట్టి, మీ ఫోన్‌లో మీకు తెలియకుండా ఇన్‌స్టాల్ అయిన యాప్స్‌‍ను వెనువెంటనే గుర్తించి తొలగించేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

Read More : రూ.3,999కే రిలయన్స్ 4జీ ఫోన్, బుకింగ్స్ రెడీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

అన్‌వాంటెడ్ యాప్స్‌ను నిలువరించే క్రమంలో ఆండ్రాయిడ్ యూజర్లు ముందు తమ ఫోన్ సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్స్‌లోకి వెళ్లి Unknown sources నుంచి మీ ఫోన్‌లలో యాప్స్ ఇన్‌స్టాల్ కాకుండా సెట్టింగ్స్ మార్చుకోండి.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

గూగుల్ ప్లే స్టోర్ యాప్‌లోకి వెళ్లి ఎడమ వైపు టాప్ స్ర్కీన్ కార్నర్ భాగంలో కనిపించే 3 లైన్ల మెనూ ఆప్షన్ పై టాప్ చేయండి. ఆ మెనూలో కనిపించే సెట్టింగ్స్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకుని అందులోని ఆటోమెటిక్ అప్‌డేట్స్‌ను అన్‌‍చెక్ చేయండి. తద్వారా అన్‌వాంటెడ్ యాప్స్‌ మీ ఫోన్ దరికి చేరవు.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

కొన్ని సందర్భాలలో మీరు డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ హెవీ యాడ్వేర్‌లను కలిగి ఉంటాయి. ఇవి మీ పర్మిషన్ అవసరం లేకుండానే అన్‌వాంటెడ్ యాప్స్‌ను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసేస్తుంటాయి. కాబట్టి, మీరు కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

మీ గూగుల్ అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మరింత పటిష్టం చేసుకోవటం ద్వారా అన్‌వాంటెడ్ యాప్స్‌ను నిలువరించవచ్చు.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

కొన్ని మోసపూరిత యాప్స్ మీ ఫోన్‌లోని విలువైన డేటాను దింగిలించి పూర్తిగా దుర్వినియోగం చేస్తాయి. అవగాహనా లోపం కారణంగా ఇటువంటి యాప్స్ మీ ఫోన్‌లో చేరే ప్రమాదముంది. కాబట్టి, ఇటువంటి ప్రమాదకర యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నట్లు తెలిస్తే వాటిని యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిలీట్ చేసేయండి.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో కొన్ని యాడ్స్ మీ కళ్ల ముందు పాపప్ అవుతుంటాయి. ఆకర్షణీయమైన హెడ్డింగ్స్‌తో కనిపించే ఈ పాపప్స్ పూర్తిగా మాల్వేర్లతో నిండి ఉంటాయి. పొరపాటున వీటి పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్లు మీ ఫోన్‌లోకి ప్రవేశించటంతో పాటు అన్‌వాంటెడ్ యాప్స్‌ ఇన్‌స్టాల్ అయిపోతాయి.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

అన్‌వాంటెడ్ యాప్స్‌ మీ ఫోన్‌ను మరింతగా ఇబ్బంది పెడుతున్నట్లియతే ఫోన్‌లోని డేటాను పూర్తిగా బ్యాకప్ చేసుకుని ఓసారి ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించండి. ఇందుకు మీరు చేయవల్సింది. settings>backup&reset.

మీ ఫోన్‌లో మీకు తెలియకుండానే యాప్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయా..?

ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్‌‍ఫామ్ కావటం వల్ల మాల్వేర్లు మీ స్మార్ట్‌ఫోన్‌లలోకి ప్రవేశించి, ఆ తరువాత మీ మెమరీ కార్డులో తిష్ట వేసే అవకాశముంది. కాబట్టి, మీ ఎస్డీ‌కార్డ్‌లోని ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటూ, కార్డును ఫార్మాట్ చేసే ప్రయత్నం చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to Stop Unwanted Apps Installed Automatically On Your Android SmartPhone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot