Home
How to

క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్నారా.. అయితే తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోండి..!!

సైబర్‌ నేరాల్లో క్రెడిట్‌ కార్డు ద్వారా నేరాలు అధికంగా ఉంటున్నాయి. కార్డుకు సంబంధించిన పిన్‌, CVV ఇతర సున్నితమైన సమాచారం దొంగిలించి అనధికారిక లావాదేవీలు నిర్వహిస్తారు. అందువల్ల క్రెడిట్‌ కార్డుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సహా ఇతర చర్యల వల్ల మోసాల బారిన పడకుండా ఉండవచ్చు. అందుకు కొన్ని సూచనలు మీకు ( Tips to Use credit cards ) ఉపయోగపడతాయి.

సైబర్ నేరాల నుంచి తప్పించుకొనేందుకు కొన్ని చిట్కాలు :
పర్యవేక్షణ అవసరం : క్రెడిట్‌ కార్డు లావాదేవీలు, స్టేట్‌మెంట్‌ పైన నిత్యం పర్యవేక్షణ అవసరం. అంటే క్రమం తప్పకుండా వాటిని పరిశీలిస్తుండాలి. ఏదైనా అనుమానాస్పద లావీదేవీలను గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

how to prevent credit card frauds

మెసేజ్‌ అలర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోవాలి : మీ కార్డు నుంచి జరిగే ప్రతి లావాదేవీలు మీకు తెలిసే విధంగా SMS లేదా ఈమెయిల్ నోటిఫికేషన్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఫలితంగా మీరు తెలిసి లేదా తెలియకుండా జరిగే ప్రతి లావాదేవీని మీరు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

2FA యాక్టివేట్‌ చేసుకోవాలి : క్రెడిట్‌ కార్డులకు అదనపు భద్రత కోసం 2 ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు కార్డులకు బలమైన పాస్‌వర్డ్‌ ను ఏర్పాటు చేసుకోవాలి. నంబర్లు, ప్రత్యేక గుర్తులు, ఆంగ్ల అక్షరాలతో ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా ఆన్‌ లైన్‌, షాపింగ్ సమయాల్లో సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండగలుగుతాం.

ఈ వెబ్‌సైట్‌ లలో మాత్రమే : తెలియని వెబ్‌సైట్‌ లు లేదా గుర్తింపు లేని వెబ్‌ సైట్ల నుంచి ఆన్‌ లైన్ షాపింగ్ చేయకూడదు. దీంతోపాటు గుర్తుతెలియని వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చిన ఈమెయిల్‌, మెసెజ్‌లోని లింక్‌ను క్లిక్‌ చేయకూడదు. మరియు క్రెడిట్‌ కార్డు వివరాలు నమోదు చేయకూడదు.

స్మార్ట్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌ టాప్‌ లో యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ను ఇన్‌ స్టాల్‌ చేయాలి. దీంతోపాటు యాప్‌లు ఎప్పుడూ అప్‌డేట్‌ గా ఉండేలా చూసుకోవాలి. పబ్లిక్‌ వైఫై ను వినియోగిస్తున్న సమయంలో ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదు. సరైన ధ్రువీకరణ లేకుండా పబ్లిక్‌ వైఫై వినియోగించకూడదు.

క్రెడిట్‌ కార్డుల రసీదులు లేదా ఇతర లావాదేవీలకు సంబంధించిన పత్రాలను బయట పారవేసే ముందు వాటిని ముక్కలు చేయడం ఉత్తమం. దీంతోపాటు క్రెడిట్‌ కార్డులను పొగొట్టుకోవడం లేదా దొంగిలించబడిన సమయాల్లో వెంటనే బ్యాంకులకు సమాచారం అందించాలి. వెంటనే బ్లాక్‌ చేసేలా చూడాలి.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Tips to Use credit cards to avoid cyber frauds here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X