టోక్యో ఒలింపిక్స్ 2020 ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద ఒలింపిక్స్ గేమ్ లకు మంచి ఆదరణ ఉంది. 2020 లో జరగవలసిన టోక్యో ఒలింపిక్స్ 2020 ఆలస్యంగా జూలై 23, 2021 అంటే నేటి నుండి ప్రారంభం కానుంది. ఇవి ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడుతుంది మరియు టీవీలో కూడా ప్రసారం అవుతుంది. రాబోయే 17 రోజులలో ప్రపంచంలోని అనేక మంది అథ్లెట్లు ఒకరితో ఒకరు పోటీ పడటం చూడడం ఎట్టి పరిస్థితులలోను మిస్ అవ్వకండి. ప్రతి రోజు IST ఉదయం 5 గంటలకు ప్రారంభమయి రోజు మొత్తం కొనసాగుతుంది.

 
టోక్యో ఒలింపిక్స్ 2020 ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడడం ఎలా?

భారతీయ అథ్లెట్లు సానియా మీర్జా, పివి సింధు, అంకిత రైనా, సౌరభ్ చౌదరి, శరత్ కమల్ మన యొక్క దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్లు పోటీ పడే అన్ని రోజుల జాబితా మరియు లైవ్ స్ట్రీమింగ్ లేదా టెలివిజన్‌లో ఈవెంట్‌ను ఎలా చూడవచ్చు వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టోక్యో ఒలింపిక్స్ 2020 ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే విధానం

టోక్యో ఒలింపిక్స్ 2020 ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడడం ఎలా?

భారతదేశంలో టోక్యో ఒలింపిక్స్ 2020 ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడుతుంది మరియు సోనీలైవ్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబడుతుంది. జాతీయ ప్రసార భారతి యొక్క దూరదర్శన్ కూడా టోక్యో ఒలింపిక్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మీ టీవీ ప్రొవైడర్‌లో ఈ ఛానెల్‌లను ఎలా చూడాలో తెలుసుకోవడానికి ఎయిర్‌టెల్, టాటా స్కై మరియు డిష్ టీవీ ఛానెల్ జాబితా పేజీలను తనిఖీ చేయండి.

*** సోనీలైవ్ iOS, ఆండ్రాయిడ్ మరియు వెబ్‌లో కూడా లభిస్తుంది. దీని యొక్క LIV ప్రీమియం ధర నెలకు రూ.299 కాగా సంవత్సరానికి 999 రూపాయలు.

టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత అథ్లెట్ల షెడ్యూల్

టోక్యో ఒలింపిక్స్ 2020 ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడడం ఎలా?

మీరు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి ఒలింపిక్స్ షెడ్యూల్‌ను చూడవచ్చు. ఇందులో మీరు అనుసరిస్తున్న భారతీయ అథ్లెట్ల షెడ్యూల్ యొక్క ముఖ్యాంశాలను తనిఖీ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Tokyo Olympics 2020: How to Watch Olympic Events Live Stream, Schedule and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X