ఫోన్ పోయిందా.. వెతికి పట్టుకోవటమెలా ?

Posted By:

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు. నేటి ప్రత్యేక ‘హౌ-టూ' శీర్షికలో భాగంగా అపహరణకు గరైన మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను వెదికి పట్టుకునే పది మార్గాలను మీ ముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్:

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను
ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

అవాస్త్ మొబైల్ సెక్యూరిటీ ( Avast! mobile security):

ఈ సెక్యూరిటీ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మొబైల్‌లోకి వైరస్ ప్రవేశించికుండా నివారించటమే కాకుండా మొబైల్ ట్రాకింగ్ వంటి రక్షణ వ్యవస్థను ఈ యూప్ ఏర్పరుస్తుంది. ఈ యూప్‌లో పొందుపరిచిన యాంటీ-తెఫ్ట్ కాంపోనెంట్ ఫోన్ అపహరణకు గురైన సందర్భంలో ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సందేశాల రూపంలో అందిస్తుంది. ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్:

మొబైల్ చేజ్ లోకేషన్ ట్రాకర్ (Mobile chase-location tracker):

ఈ అత్యుత్తమ అప్లికేషన్ అపహరణకు గురైన ఫోన్‌లను చేధించటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. సదురు మొబైల్ ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి సిమ్ కార్డ్ మార్చినా లేక కొత్త సిమ్ నెంబర్ ద్వారా సందేశం పంపినా తక్షణమే మీకు సమాచారాన్ని ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది. డౌన్‌లోడ్ లింక్:

తీఫ్ ట్రాకర్ (Thief tracker):


ఈ అప్లికేషన్ సాయంతో ఫోన్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు. మీ మొబైల్‌ను ఎవరైనా అన్‌లాక్ చేయడానికి ప్రయత్నించినట్లయితే తీఫ్ ట్రాకర్ ఆ వ్యక్తికి తెలియకుండానే ఫ్రంట్ కెమెరా ద్వారా అతని చిత్రాన్ని క్యాప్చర్ చేసి ఈ-మెయిల్‌కు పంపుతాయి. అయితే కొన్ని పరిమితులు లేకపోలేదు. డౌన్‌లోడ్ లింక్:

స్మార్ట్ లుక్ (Smart look):

ఈ సాఫ్ట్‌వేర్, మీ మొబైల్ దొంగిలించిన వ్యక్తి ఫోటోను క్యాప్చర్ చేసి వెనువెంటనే మీ ఈ-మెయిల్‌కు చేరవేస్తుంది. అంతేకాదండోయ్ ఈ యూప్‌లో పొందుపరిచన కంటిన్యూస్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం గూగుల్ మ్యాప్ సాయంతో ఫోన్ ఆచూకీని చేధించగలదు.

యాంటీ-తెఫ్ట్ ఆలారమ్ (Anti- theft alaram):

ఈ అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లోకి సులువుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లోని ఆలారమ్ ఫీచర్‌ను ఆన్‌చేస్తే సరిపోతుంది. అపరిచిత వ్యక్తి మీ ఫోన్‌ను అన్‌లాక్ చేసే ప్రయత్నం చేస్తే ఆలారమ్ మోగటం ప్రారంభిస్తుంది. పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారానే ఆలారమ్‌ను ఆఫ్ అవుతుంది. లింక్ అడ్రస్:

కాస్పర్ స్కై మొబైల్ సెక్యూరిటీ (Kaspersky mobile security):

ఈ అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌కు అన్ని విధాలుగా రక్షణ కవచంలా నిలుస్తుంది. యాంటీ-తెఫ్ట్, యాంటీ వైరస్, క్లౌడ్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను యూప్‌లో నిక్షిప్తం చేశారు. డౌన్‌లోడ్ లింక్:

లుక్ అవుట్ సెక్యూరిటీ ఇంకా యాంటీ వైరస్ (Lookout security and antivirus):

ఈ ఉచిత అప్లికేషన్ అనేకమైన రక్షణాత్మక ఫీచర్లను ఒదిగి ఉంది. అపహరణకు గురైన ఫోన్‌ను వెదికిపట్టుకోవటంలో ఈ యూప్ కీలకంగా సహాయపడుతుంది. గూగుల్ మ్యాప్ సాయంతో పోన్ ఆచూకీని ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. రిమోట్ లాక్ ఇంకా డేట్ వైప్ అవుట్ వంటి ప్రత్యేకతలు ఈ అప్లికేషన్‌లో ఉన్నాయి. డౌన్‌లోడ్ లింక్:

ట్రెండ్ మైక్రో మొబైల్ సెక్యూరిటీ & యాంటీ వైరస్ (Trend Micro mobile security & antivirus):

అత్యధికంగా అమ్ముడువుతున్న అప్లికేషన్‌లలో ఈ అప్లికేషన్ మొదటి స్థానాల్లో ఉంది. పటిష్టమైన యాంటీ వైరస్, యాంటీ తెఫ్ట్ ఫీచర్లను ఈ యూప్‌లో పొందుపరిచారు. లింక్ అడ్రస్:

ప్లాన్ బి, లుక్ అవుట్ మొబైల్ సెక్యూరిటీ (Plan B, Lookout mobile security):

ప్లాన్ ‘ఏ' విజయవంతం కాని పక్షంలో ప్లాన్ ‘బి'ని ఆచరణలోకి దింపే విధంగా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ ప్లాన్ బి అప్లికేషన్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లియితే సెల్ టవర్స్ ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ ఆధారంగా ఫోన్ సమాచారాన్నిఈ- మెయిల్స్ రూపంలో ప్రతి పది నిమిషాలకు పొందవచ్చు. లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot