వాటర్ మార్క్ లేకుండా మీ స్క్రీన్ ను రికార్డు చేయగల FREE సాఫ్ట్ వేర్ లు

By Maheswara
|

మీ ఆఫీస్ లో ఏదైనా ప్రెసెంటేషన్ ఇవ్వాల్సిన , లేదా మీ అవసరాలకు తగ్గట్లు మీ కంప్యూటర్ స్క్రీన్ ను రికార్డు చేయవలసి వచ్చినప్పుడు. ప్రతిఒక్కరు స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్ వెర్ లు మరియు app లపై ఆధారపడుతుంటారు. కొన్ని సాఫ్ట్ వేర్ లు మీ కంప్యూటర్ లో కానీ మొబైల్ ఫోన్లలో కానీ ఇన్ బిల్ట్ గా వస్తాయి.అలా కాకుండా మీకు స్క్రీన్ రికార్డింగ్ కోసం వాటర్ మార్క్ లేకుండా రికార్డు చేసుకోగల 5 బెస్ట్ ఫ్రీ రికార్డింగ్ సాఫ్ట్ వేర్ లు మీ కోసం ఇక్కడ తెలియచేస్తున్నాము. వీటితో మీరు చాలా సులభంగా రికార్డ్ చేయవచ్చు, ఇంకా వీటిలో రికార్డు చేసిన వీడియో లో వాటర్ మార్క్ కూడా ఉండదు.

స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్‌వేర్
 

ఈ విధంగా వాటర్‌మార్క్ లేని ఉచిత స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్‌వేర్ అవసరం ఎంతైనా ఉంది. ఆన్‌లైన్‌లో వాటర్‌మార్క్ లేకుండా స్క్రీన్ రికార్డర్ లు ఉన్నాయి. వాటిలో పిసి కోసం ఉత్తమ స్క్రీన్ రికార్డర్ కోసం చూస్తున్నట్లయితే,వాటర్ మార్క్ లేకుండా మీ స్క్రీన్ ను రికార్డు చేయగల టాప్ 5 సాఫ్ట్ వేర్ లు,లేదా app లు చూసేద్దాం రండి.

1 .Active Presenter

2 .OBS Studio

3 .Quick Time

4 .Screencast O - Matic

5 .Tiny Take

వాటర్  మార్క్ లు లేకుండా

వాటర్  మార్క్ లు లేకుండా

ఇక్కడ ఇచ్చిన సాఫ్ట్ వేర్ లతో మీరు వాటర్ మార్క్ లు లేకుండా సింపుల్ గా మీ డెస్క్ టాప్ స్క్రీన్ ను రికార్డు చేయవచ్చు.ఈ సాఫ్ట్ వేర్ లను ఎలా డౌన్లోడ్ చేసి(How to download And Install) , రికార్డు చేయాలో మీ కోసం ఒక శాంపిల్ Demo చూపిస్తున్నాము దీనిని ఫాలో అవ్వండి.

Also Read: Signal యాప్ లో చాటింగ్ డేటాను బ్యాకప్ తీయడం ఎలా??Also Read: Signal యాప్ లో చాటింగ్ డేటాను బ్యాకప్ తీయడం ఎలా??

డెమో లో భాగంగా
 

డెమో లో భాగంగా

డెమో లో భాగంగా Active Presenter సాఫ్ట్ వేర్ ను ఎలా డౌన్లోడ్ చేయాలి ,ఎలా ఇన్ స్టాల్ చేయాలి మరియు మీ స్క్రీన్ ను ఎలా రికార్డు చేయాలో కూడా చూపిస్తున్నాము.

1 .ఈ Active Presenter సాఫ్ట్ వేర్ Atomi సిస్టం నుండి విడుదల చేయబడింది.దీనిని మీరు https://atomisystems.com/download/# లింక్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయవచ్చు. లేదా గూగుల్ లో సెర్చ్ చేసి అయినా డౌన్లోడ్ చేయవచ్చు.

2 .ఈ పేజీ ఓపెన్ చేసిన తర్వాత windows లేదా iOS కు తగినట్లుగా ,మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ కు తగ్గట్లు ఎంచుకొని Download పైన క్లిక్ చేయండి.

3 . Download అయినా ఫైల్ పైన క్లిక్ చేయండి .మిమ్మల్ని setup పేజీ కి తీసుకెళ్తుంది.

4 .installation ప్రాసెస్ పూర్తి అయినా తర్వాత, మీరు మీ స్క్రీన్ రికార్డు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

5 . ఇప్పుడు మీరు Active Presenter ను ఓపెన్ చేసి మీరు రికార్డు చేయవల్సిన స్క్రీన్ ను ఎంచుకోవాలి .

6 .full screen లేదా screen లో కొంత భాగాన్ని రికార్డు చేయాలో ఎంచుకున్న తర్వాత, రికార్డింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.

7 . మీ స్క్రీన్ రికార్డింగ్ ఆపాలంటే 'ctrl +End ' ను నొక్కాలి.

8 . దీనితో మీరు ఇదివరకు రికార్డు చేసిన వీడియో మీరు ఎంచుకున్న ఫోల్డర్ లో సేవ్ చేయవచ్చు.

9 .మీరు రికార్డు చేసిన వీడియో ను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు.

మొబైల్ ఫోన్ల కోసం

మొబైల్ ఫోన్ల కోసం

ఇంతే కాక ,మీ మొబైల్ ఫోన్ల కోసం కూడా కొన్ని స్క్రీన్ రికార్డింగ్ App లు ఉన్నాయి.వాటిలో Az Screen Recorder App ను మీరు ట్రై చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 5 Best Free Screen Recording Softwares For Desktop, Without Watermark.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X