ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?

యూట్యూబ్..ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?

ఇటీవల యూట్యూబ్ కోసం offline viewing సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియోలను ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమయంలో డౌన్‌లోడ్ చేసుకుని వాటిని ఎప్పుడు కావలంటే అప్పడు ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా వీక్షించవచ్చు. ఆ ప్రక్రియను ఇప్పుడు చూద్దాం...

Read More : రూ.937 చెల్లిస్తే Moto G4 మీ సోంతం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా యూట్యూబ్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో లాంచ్ చేయండి. ఇప్పుడు తప్సనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ అన్ అయి ఉండాలి.

స్టెప్ 2

ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకుని తరువాత చూడలనుకుంటున్న వీడియోను ఓపెన్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

ఆ వీడియో క్రింద మీకు డౌన్‌లోడ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే ఓ పాప్-అప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో కావల్సిన వీడియో రిసల్యూషన్‌ను సెలక్ట్ చేసుకుని OK బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

వీడియో డౌన్‌లోడ్ అయిన వెంటనే యూట్యూబ్ యాప్ హోమ్ పేజీలోకి వెళ్లి, యాప్‌కు సంబంధించిన మెనూను ఓపెన్ చేయంది. అక్కడ మీకు 'offline' ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 5

'offline' ఆప్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోల జాబితా కనిపిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో సంబంధం లేకుండా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని వీక్షించవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Trick to Watch YouTube Videos without Internet. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting