సెక్యూరిటీ విషయంలో మీ ఫోన్‌ స్టామినా ఎంత...?

Written By:

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ఇంటర్నెట్‌కు చాలా సులువుగా కనెక్ట్ కావొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే సమయంలో అనేక ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను మనం యాక్సెస్ చేసుకుంటుంటాం. ఈ క్రమంలో మన వెబ్ బ్రౌజింగ్ యాక్టివిటీలను పసిగడతూ హ్యాకర్లు ఫోన్‌ల పై విరుచుకుపడుతుంటారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

సెక్యూరిటీ విషయంలో మీ ఫోన్‌ స్టామినా ఎంత...?

స్మార్ట్‌ఫోన్ వినియోగం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్న హ్యాకర్లు వారి ఫోన్‌లలో భయనాక వైరస్‌లను జొప్పించి కీలకమైన వ్యక్తిగత డేటాను దొంగిలించేస్తున్నారు. హ్యాకర్ల భారిన పడుతున్నస్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు 10 సింపుల్ టిప్స్‌ను ఇప్పుడు సూచించటం జరుగుతోంది...

Read More : మే 17న Moto G4, అమెజాన్‌లో మాత్రమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టు స్టెప్ అథెంటికేషన్

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీ ఫోన్‌లోని ముఖ్యమైన డేటాకు టు స్టెప్ అథెంటికేషన్ ప్రాసెస్‌ను ఇంప్లిమెంట్ చేయండి. ఈ చర్య మీ ఫోన్ డేటాకు మరింత రక్షణగా నిలుస్తుంది. డేటాను యాక్సెస్ చేుసుకోవల్చిన ప్రతిసారి వెరిఫైడ్ ఫోన్ నెంబర్‌కు ఓ ప్రత్యేకమైన కోడ్ అందుతుంది. ఈ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే డేటా యాక్సెస్‌కు వీలుంటుంది.

డేటా ఎన్‌క్రిప్షన్ తప్పనిసరి

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను పబ్లిక్ వై-ఫై లేదా హాట్ స్పాట్ ద్వారా షేర్ చేయకండి. ఇవి డేటా తెఫ్ట్‌కు ప్రధాన ప్రోన్ ఏరియాలు ఇవే.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లు

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీ ఫోన్‌లోని ప్రతి అప్లికేషన్‌కు శక్తివంతమైన పాస్‌‍వర్డ్‌ను సెట్ చేసుకోండి.

శక్తివంతమైన యాంటీవైరస్ ప్రొటెక్షన్‌

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్, స్కేర్‌వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకర వైరస్‌లు మీ ఫోన్‌ను చుట్టుముట్టకండా ఉండేందుకు శక్తివంతమైన యాంటీవైరస్ ప్రొటెక్షన్‌ను సెట్ చేసుకోండి.

పబ్లిక్ వై-ఫై జోలికి వెళ్లకండి

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై హాట్ స్పాట్‌లకు దూరంగా ఉండండి. ఇక్కడే మీ డేటా కోసం హ్యాకర్లు కాచుకుని కూర్చొని ఉంటారు.

ఆఫర్ల మత్తులో ఫేక్ వెబ్‌సైట్‌ల ఉచ్చులో ఇరుక్కోకండి

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీకు ఆన్‌లైన్ షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఆఫర్ల మత్తులో మునిగి ఫేక్ వెబ్‌సైట్‌ల ఉచ్చులో ఇరుక్కోకండి. జెన్యున్ వెబ్‌సైట్‌లను మాత్రమే ఆశ్రయించండి.

పాపప్ యాడ్స్‌తో జాగ్రత్త

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న అనేక పాప్ యాడ్స్ నమ్మశక్యం ఆఫర్లతో మిమ్మల్ని ఊరిస్తుంటాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా ప్రమాదకర వైరస్ లు మీ ఫోన్ ను చట్టుముట్టే ప్రమాదముంది.

మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌లో బ్రౌజర్ చేస్తున్నారా..?

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

 అయితే "https"తో ప్రారంభమయ్యే యూఆర్ఎల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి ప్రవేశించినట్లయితే యూఆర్ఎల్స్ విషయంలో అప్రమత్తత వహించండి. మీకు తెలియని అనుమానస్పద యూఆర్ఎల్స్‌‍ను ఏ మాత్రం క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఆ యూఆర్ఎల్ మీ మిత్రుని ద్వారా వచ్చినట్లయితే ఒకసారి అతనిని అడిగి విషయం ఏంటో తెలుసుకోండి.

Find Your Phone Tool

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయినట్లయితే Find Your Phone Toolను మీ డివైస్‌‍లో ఇన్‌స్టాల్ చేసుకోండి. అనుకోని పరిస్థితుల్లో మీ ఫోన్ మిస్ అయినట్లయితే వెతికి పట్టుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.

తెలియని ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్త

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీకు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈమెయిల్స్ లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో జాగ్రత్తగా ఉండండి. వీటిలో కూడా వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.

డౌన్‌లోడింగ్ యాప్స్‌తో జాగ్రత్త

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

మీరు డౌన్‌లోడ్ చేసుకునే అప్లికేషన్‌లకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్‌లను ముందుగా నిశితంగా పరిశీలించుకుని ఆ తరువాత ప్రొసీడ్ అవ్వండి.

ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ విషయంలో జాగ్రత్త

మీ మొబైల్ డివైస్ సెక్యూరిటీని మరింత కఠినతరం చేసుకునేందుకు సింపుల్ టిప్స్‌

నేటి తరం స్మార్ట్‌ఫోన్‌లు డెస్క్‌టాప్ కంప్యూటర్‌లకు ధీటుగా ప్రాసెసింగ్ శక్తిని కలిగి ఉంటున్నాయి. కాబట్టి స్మార్ట్‌ఫోన్ ద్వారా మెయిల్ చెక్ చేసుకునే సందర్భంలో అప్రమత్తత వహించటం మంచిది. ముఖ్యంగా ఈమెయిల్ ఆటాచ్‌మెంట్స్ తెరిచే విషయంలో జాగ్రత్త వహించండి లేకుంటే అనవసర వైరస్‌లు మీ డివైజ్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tricks Ensuring your Mobile Data Security. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot