డెలిట్ చేసిన కాంటాక్ట్ నంబర్‌ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఇలా చేయండి

|

నేటి స్మార్ట్ మరియు ఫాస్ట్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించని వారు ఉండరు. స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకుండా బయటకు వెళ్ళడానికి కూడా ఎవ్వరు ఇష్టపడడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ల సాయంతోనే డిజిటల్ రూపంలో పేమెంట్స్ చేస్తున్నారు కూడా. స్మార్ట్‌ఫోన్లను వినియోగించే ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్‌లలో ముఖ్యమైన డాక్యుమెంట్లను, ఫోటోలు, వీడియోలను మరియు కాంటాక్ట్ నంబర్‌లను సేవ్ చేస్తూ ఉంటారు. ముందు తరం వారు నంబర్‌లను ఏదైనా ఒక బుక్ లో రాసుకునే వారు. అయితే కొంత మంది 100 కి పైగా అలాగే గుర్తుకు పెట్టుకునే వారు.

 

కాంటాక్ట్ నంబర్లు

కాకపోతే ఫోన్లు అందుబాటులోకి రావడంతో అన్ని కూడా అందులో సేవ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అనుకోని ఏవైనా కారణాలతో యాక్సిడెంటల్ గా కొన్ని కాంటాక్ట్ నంబర్లు డిలీట్ చేయబడుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో వినియోగదారులు నిరాశ చెందకుండా డెలిట్ చేయబడిన కాంటాక్ట్ నంబర్‌ను తిరిగి పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గూగుల్ కాంటాక్ట్ యాప్ మరియు వెబ్‌సైట్‌ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఫోన్లలో కాంటాక్ట్ నెంబర్లను తిరిగి పొందవచ్చు. అలాగే ఐఫోన్లో iTunes యాప్ మరియు iCloud యాప్ వెబ్‌సైట్‌ని ఉపయోగించి డెలీట్ నెంబర్లను తిరిగి పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

స్నాప్‌చాట్‌లో యూట్యూబ్ వీడియోలను షేర్ చేయడం ఎలా?స్నాప్‌చాట్‌లో యూట్యూబ్ వీడియోలను షేర్ చేయడం ఎలా?

Google కాంటాక్ట్స్ యాప్‌ని ఉపయోగించి డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం
 

Google కాంటాక్ట్స్ యాప్‌ని ఉపయోగించి డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

* గూగుల్ కాంటాక్ట్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* తరువాత ఎడమవైపు ఎగువన గల మూడు చుక్కల హాంబర్గర్ మెనుపై నొక్కండి.
* తరువాత ట్రాష్-ట్రాష్ ఎంపికను ఎంచుకోండి.
* ఇప్పుడు మీరు గత 30 రోజులలో మీ గూగుల్ అకౌంట్ నుండి తొలగించిన కాంటాక్ట్ ల జాబితా కనిపిస్తుంది.
* మీరు మీ ఫోన్‌లోకి తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్ పై ఎక్కువసేపు నొక్కి ఉంచండి.
* తరువాత కుడివైపు ఎగువన ఉన్న మూడు చుక్కలపై నొక్కి రికవర్ ఎంపికను ఎంచుకోండి.

వెబ్‌సైట్ ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

వెబ్‌సైట్ ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

* గూగుల్ కాంటాక్ట్స్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
* ఎడమవైపు ఉన్న మెనులో 'ట్రాష్ - ట్రాష్' ఎంపిక మీద క్లిక్ చేయండి.
* మీరు మీ ఫోన్‌లో తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్లను ఎంచుకోండి.
* రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి.

iTunes ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

iTunes ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

* USB కేబుల్ ద్వారా మీ ఫోన్‌ని మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయండి.
* మీ ఫోన్‌లో 'ఫైండ్ మై ఐఫోన్'ని ఆఫ్ చేయండి.
* మీ PCలో iTunes యాప్‌ని ఓపెన్ చేయండి.
* మీరు ఫోన్‌ని కనెక్ట్ చేసిన తర్వాత iTunes యాప్‌లోని ఐఫోన్ చిహ్నంపై క్లిక్ చేయండి.
* మీరు ఇటీవల తొలగించిన కాంటాక్టుని కలిగి ఉన్న బ్యాకప్‌ను ఎంచుకోండి.
* రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి.
* ఈ ప్రక్రియను పూర్తి అయిన తరువాత ఫోన్ రీబూట్ అవుతుంది.

iCloud ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

iCloud ద్వారా డెలిట్ నంబర్‌లను తిరిగి పొందే విధానం

* మీ ఆపిల్ ID మరియు పాస్‌వర్డ్‌ని నమోదు చేసి iCloud.comకి సైన్ ఇన్ చేయండి.
* iCloud.com విండో ఎగువన ఉన్న మీ పేరు మీద క్లిక్ చేయండి.
* అకౌంట్ సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
* పేజీని దిగువకు స్క్రోల్ చేయండి.
* తరువాత 'కాంటాక్ట్ రీస్టోర్' ఎంపిక మీద క్లిక్ చేయండి.
* మీరు తిరిగి పొందాలనుకునే కాంటాక్ట్ నెంబర్ ముందు తేదీ పక్కన ఉన్న రికవర్ ఎంపికపై క్లిక్ చేయండి.
* నిర్ధారించడానికి రికవర్ మీద క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Trying to Recover Deleted Contact Number on Android: Follow These Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X