Twitter Spaces కొత్త ఫీచర్ ఆడియోను రికార్డ్ చేయడం ఎలా??

|

Twitter ఇప్పుడు వినియోగదారులు ట్విట్టర్ స్పేస్ అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారుల యొక్క సంభాషణను రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. ఒకవేళ మీరు ఈ సంభాషణను తర్వాత వినాలనుకుంటే కూడా వీలుకల్పిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాని ప్రత్యర్థి యాప్ క్లబ్‌హౌస్ చాట్‌రూమ్ రికార్డింగ్‌లను అనుమతించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. Twitter ఈ కార్యాచరణను iOS మరియు ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం విడుదల చేసింది. దీనికి ముందు iOS వినియోగదారులు మాత్రమే స్పేసేస్ రికార్డింగ్‌లను వినగలగడానికి అనుమతి ఉండేది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు చాలా పాడ్‌క్యాస్ట్‌ల వలె కనిపిస్తుంది.

Twitter Spaces New Feature Audio Recording Process Step by Step on iOS and Android

వినియోగదారు సెషన్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పుడు పాల్గొనేవారికి దాని గురించి అవగాహన కల్పించబడుతుంది. ఈ పార్టిసిపెంట్‌లకు వారి స్పేస్ వ్యూ ఎగువన "Rec" బటన్ కనిపిస్తుంది. ఇది ముగిసిన తర్వాత వినియోగదారులు ప్లాట్‌ఫారమ్ నుండి ఈ రికార్డింగ్‌ను షేర్ చేయగలరు. Twitter ప్రకారం కొంతమంది ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులు ఇప్పుడు "Start a Space"ని ఎంచుకునే ముందు "రికార్డ్ స్పేస్"పై క్లిక్ చేయడం ద్వారా స్పేస్‌లను రికార్డ్ చేసే ఎంపికను కలిగి ఉంటారు. ఇది రికార్డింగ్ పూర్తయిన తర్వాత కూడా వినడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

ముఖ్యంగా నియమ ఉల్లంఘనల ప్రకారం ట్విట్టర్ రికార్డింగ్‌లను తనిఖీ చేయడానికి, వినడం మరియు భాగస్వామ్యం చేయడం కోసం 30 నుండి 120 రోజుల పాటు రికార్డింగ్‌ను ఉంచుతుంది. దీనికి ముందు ట్విట్టర్ స్పేస్‌లు ప్రత్యక్ష చర్చలను నిర్వహించే ఆడియో చాట్‌రూమ్‌లు మాత్రమే. ఆ సెషన్‌లను రికార్డ్ చేసే సామర్థ్యం ఏ వినియోగదారుకు లేదు.

Twitter Spaces New Feature Audio Recording Process Step by Step on iOS and Android

Twitter ఇటీవల iOS వినియోగదారుల కోసం టిక్కెట్‌ల స్పేస్‌లు లేదా పేమెంట్ లైవ్ ఆడియో రూమ్లను విడుదల చేయడం ప్రారంభించింది. హోస్ట్‌లు వారి టిక్కెట్టు చాట్‌రూమ్‌ల కోసం $1 మరియు $999 మధ్య వసూలు చేయవచ్చని Twitter ప్రకటించింది. వారికి రూమ్ సైజ్ క్యాప్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొబైల్ యాప్‌లో ఎగువన ఉంచడం ద్వారా ఈ ఆడియో రూమ్‌లను కనుగొనడాన్ని కంపెనీ వినియోగదారులకు సులభతరం చేసింది.

Best Mobiles in India

English summary
Twitter Spaces New Feature Audio Recording Process Step by Step on iOS and Android

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X