మీ ఆధార్ మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలా...? మొబైల్ App లోనే చేసుకోండి.
ఆధార్ మాతృ సంస్థ అయిన భారత ప్రభుత్వ UIDAI మంగళవారం తన వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ ల ద్వారా ప్రజలు ఆధార్ కు లింక్ అయిన తమ మొబైల్ నంబర్‌లు మరియు వారి ఆధార్‌తో సీడ్ చేయబడిన ఇమెయిల్ IDలను ధృవీకరించడానికి కొత్తగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఆధార్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్న UIDAI అందించిన ఈ సమాచారం ప్రకారం, ప్రజలు తమ మొబైల్ నంబర్‌లలో ఏ నెంబర్ తమ ఆధార్‌కు లింక్ చేయబడిందో తెలియదని లేదా ఖచ్చితంగా తెలియదని గమనించిన తర్వాత వారు తాము లింక్ చేసిన మొబైల్ నెంబర్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చని తెలిపింది.

"అందుకు వారికి ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్‌కు వెళుతుందని ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు, ఈ ఫీచర్ తో, ప్రజలు వీటిని చాలా సులభంగా తనిఖీ చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో 'వెరిఫై ఇమెయిల్/మొబైల్ నంబర్' ఫీచర్ కింద ఈ కొత్త అవకాశాన్ని పొందవచ్చు. లేదా mAadhaar యాప్ ద్వారా కూడా చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రజలకు ఇమెయిల్/మొబైల్ నంబర్ సంబంధిత ఆధార్‌కు లింక్ అయిందని తెలియచేస్తుంది" అని UIDAI ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక వేళ మీ మొబైల్ నంబర్ లింక్ చేయని పక్షంలో కూడా మీకు తెలియచేస్తుంది. తర్వాత మీరు మీ వివరాలు లింక్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియచేస్తుంది. మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తుంది.
"మొబైల్ నంబర్ ఇప్పటికే వెరిఫై చేసి ఉన్నట్లైతే, స్క్రీన్‌పై ప్రదర్శించబడే 'మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది' మెసెజ్ ను మీరు చూస్తారు. ఒకవేళ వ్యక్తి మొబైల్ నంబర్ ఆమె/అతను గుర్తుంచుకోకపోతే నమోదు సమయంలో ఇచ్చినట్లు, ఆమె/అతను Myaadhaar పోర్టల్ లేదా mAadhaar యాప్‌లో వెరిఫై ఆధార్ ఫీచర్‌లో మొబైల్‌లోని చివరి మూడు అంకెలను తనిఖీ చేయవచ్చు" అని ఈ ప్రకటన పేర్కొంది.
మొదటిసారి ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ప్రజలు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఆన్లైన్ ద్వారా మీరు మీ వివరాలు వెరిఫై చేసుకోవడానికి మాత్రమే వీలుంటుంది గమనించగలరు.
ఇటీవలే, ప్రకటించిన సమాచారం ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకూ, ఆధార్ అప్డేట్ చేయాలి అని కూడా తెలుసుకోండి.మొదటి సారి నమోదు చేసుకునే సమయంలో 5 లేదా 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఫోటోగ్రాఫ్‌ల వంటి బయోమెట్రిక్ వివరాలను మళ్ళీ అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. అదనంగా, UIDAI మార్గదర్శకాల ప్రకారం, ఆధార్ ఫోటో అప్‌డేట్ లేదా ఇతర బయోమెట్రిక్ సమాచారం ను అప్డేట్ చేయడం అవసరం
*మొదటి సారి నమోదు సమయంలో పిల్లల వయస్సు 5 ఏళ్లలోపు ఉంటే, వారు 5 ఏళ్లు నిండిన తర్వాత మళ్లీ నమోదు చేసుకోవాలి మరియు మొత్తం బయోమెట్రిక్ డేటాను అందించాలి. *ఎన్‌రోల్‌మెంట్ సమయంలో పిల్లల వయస్సు 5 మరియు 15 సంవత్సరాల మధ్య ఉంటే, వారు 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అప్డేట్ ల కోసం అన్ని బయోమెట్రిక్‌లను అందించాలి.
*నమోదు సమయంలో 15 ఏళ్లు పైబడిన వారు, ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి వారి బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయాలని సిఫార్సు చేయబడింది.


Click it and Unblock the Notifications








