Home
How to

Ransomware అంటే ఏంటి..?

By Sivanjaneyulu Bommu

పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులను డిమాండ్ చేయటం, ఇవ్వకపోతే వాళ్లని హతమార్చటం వంటి ఉదంతాలను సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాంటిదే ఈ Ransomware. మీ కంప్యూటర్‌లోని ముఖ్యమైన డేటాను మీకు తెలియకుండా దొంగిలించి, దాన్నీ మీకు తిరిగిచ్చేందుకు చేసే బ్లాక్‌మెయిలింగ్‌‌నే రాన్సమ్‌వేర్‌గా కంప్యూటర్ పరిభాషలో మనం అభివర్ణించుకుంటున్నాం. Ransomwareకు సంబంధించి టెక్నికల్ భాగాన్ని పరిశీలించినట్లయితే...

Read More : ప్రముఖ మోటరోలా స్మార్ట్‌ఫోన్ పై రూ.5,000 తగ్గింపు

 క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్

క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్

Ransomware అనేది సైబర్ క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్. దీన్నీ మీ పీసీలో హోస్ట్ చేసినట్లయితే, మీ అనుమతి లేకుండానే డివైస్ మొత్తం లాక్ అయిపోతుంది. అంతేకాదు, ఫోన్ ఆపరేషన్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇక్కడి నుంచి సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభిస్తారు. కొంత నగదు చెల్లిస్తేనే ఫోన్‌ను అన్‌లాక్ చేస్తామని హెచ్చరికలు పంపుతుంటారు. ఈ నగదు చెల్లింపు అనేది బిట్ కాయిన్స్ ఇంకా ఇతర డిజిటల్ కరెన్సీల రూపంలో చేయాల్సి ఉంటుంది.

 చాలా రకాలుగా ఉంటుంది

చాలా రకాలుగా ఉంటుంది

Ransomware అనేది చాలా రకాలుగా ఉంటుంది. గుర్తుపట్టలేని విధంగా ఉండే Ransomware ఫైల్, మీ కంప్యూటర్‌లోకి సాదారణ ఫైల్ మాదిరిగానే ఉంటుంది. ఈ ప్రమాదకర ఫైల్ గనుక మీ కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే పీసీలోని అన్ని ఫైల్స్ మీకు తెలియకుండానే ఒక్కొక్కటికి ఎన్‌క్రిప్ట్ కాబడతాయి. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే సిస్టం మొత్తం ఎన్‌క్రిప్ట్ కాబడినట్లు ఓ ఎర్రర్ మెసేజ్ స్ర్కీన్ పై ప్ర్తత్యక్షమవుతుంది.

 పెద్దమొత్తంలో నగదు డిమాండ్..

పెద్దమొత్తంలో నగదు డిమాండ్..

పీసీలో లాక్ చేసిన డేటాను అన్‌లాక్ చేయాలంటే పెద్దమొత్తంలో నగదు తమకు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తుంటారు. ఒకవేళ ఆ మొత్తం వాళ్లకు చెల్లించినా, మొత్తం సమాచారం వచ్చే అవకాశం తక్కువేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు డిమాండ్  చేసిన మొత్తాన్ని నిర్ణీత గడువులోపు చెల్లించిన పక్షంలో డేటా మొత్తాని అటాకర్లు డిలీట్ చేసేస్తారు.

ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు

ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు

Ransomware అనేది ఏ విధంగానైనా మీ కంప్యూటర్‌లోకి చొరబొడగలదు. వెబ్ సైట్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, ఇతర మాల్వేర్ల ద్వారా ఏ రూపంలోనైనా మీ డివైస్ లోకి చొరబడగలదు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు

అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు

క్రిప్టోలాకర్, క్రిప్టోవాల్, లాకీ, సమాస్, సమ్‌సమ్, సమ్‌సా ఇలా అనేక పేర్లతో రాన్సమ్‌వేర్లు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. వీటిలో ప్రధానమైన క్రిప్టోలాకర్ అనే రాన్సమ్‌వేర్‌ను సెప్టంబర్ 5, 2013లో గుర్తించారు. ఈ రాన్సమ్‌వేర్‌‌ను ప్రధానంగా మైక్రోసాఫ్ట్ విండోస్ డివైస్‌లను టార్గెట్ చేస్తూ సైబర్ క్రిమినల్స్ తయారు చేసుకున్నారు.

 Locky

Locky

మరో రాన్సమ్‌వేర్‌ అయిన Lockyని ఫిబ్రవరి 2016లో గుర్తించారు. మైక్రోసాప్ట్ వర్డ్ డాక్యుమెంట్స్ రూపంలో ఉండే ఈ రాన్సమ్‌వేర్‌ ఫైల్ క్రిప్టోలాకర్ కంటే ప్రమాదకరమైనది.

Best Mobiles in India

English summary
What is Ransomware? Understanding and Protecting. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X