UPI పేమెంట్ విఫలమైతే సమస్యలను ఎలా పరిష్కరించాలి?

|

UPI గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. మనలో చాలా మంది వారి యొక్క రోజువారీ పేమెంట్లను మరింత సులభతరం చేసింది. ఆన్ లైన్ పద్దతిలో పద్దతిలో చెల్లింపులు చేసేటప్పుడు UPI మోడ్ అనేది అత్యధికంగా ఉపయోగించే డిజిటల్ పద్ధతుల్లో ఒకటి. ఇటువంటి పేమెంట్ పద్దతులను అధికంగా వినియోగించే వారు తమ రోజువారీ పరిమితిని దాటుతూ కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును UPIలో రోజువారీ లావాదేవీలకు పరిమితి ఉండవచ్చు.

 
UPI పేమెంట్ విఫలమైతే సమస్యలను ఎలా పరిష్కరించాలి?

మీరు UPIలో పేమెంట్ చేసినప్పుడు బహుళ యాప్‌లు మరియు బహుళ బ్యాంకుల ప్రసరణల కలయికలు ఉంటాయి. మీరు యాప్‌ల ద్వారా ఎంత డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు అనేదానికి రోజువారీ మరియు నెలవారీ పరిమితులు ఉన్నాయి. మీరు ఉపయోగిస్తున్న యాప్, UPI లేదా మీ బ్యాంక్‌కి పరిమితులు మారవచ్చు. PhonePe మరియు GPay వంటి నాన్-బ్యాంకింగ్ యాప్‌లు ఇప్పటికీ UPI లావాదేవీల విభాగంలో సింహభాగాన్ని కలిగి ఉన్నాయి. ఈ యాప్‌లను మీరు అధికంగా వినియోగిస్తుంటే కనుక మీరు తరచుగా విఫలమైన లావాదేవీని చూడవచ్చు. దీనికి గల అనేక కారణాలలో రోజువారీ పరిమితి కూడా ఒకటి కావచ్చు. అయితే ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రోజువారీ పరిమితులను చేరుకోవడానికి గల కారణాలు

UPI పేమెంట్ విఫలమైతే సమస్యలను ఎలా పరిష్కరించాలి?

-మీరు అన్ని UPI యాప్‌లలో ఒక రోజులో రూ.1,00,000 కంటే ఎక్కువ పంపడానికి ప్రయత్నించడం.
-మీరు అన్ని UPI యాప్‌లలో ఒక రోజులో 10 కంటే ఎక్కువ సార్లు డబ్బు పంపడానికి ప్రయత్నించడం.
-మీరు ఒకరి నుండి ₹2,000 కంటే ఎక్కువ రిక్వెస్ట్ చేయడం.

రోజువారీ పరిమిత సమస్యలను పరిష్కరించే విధానం

- మీరు ఎక్కువ మొత్తంలో మిగిలిన మరింత డబ్బును పంపడానికి మరుసటి రోజు వరకు వేచి ఉండవచ్చు లేదా మీరు తక్కువ మొత్తాన్ని రిక్వెస్ట్ చేయవచ్చు.

మీరు మీ బ్యాంక్ పరిమితులను చేరుకున్నట్లయితే ఏమి చేయాలి

UPI పేమెంట్ విఫలమైతే సమస్యలను ఎలా పరిష్కరించాలి?

మీ రోజువారీ లావాదేవీలు UPI పరిమితి కంటే తక్కువగా ఉంటే మరియు లావాదేవీలు తరచూ విఫలం అయ్యే సమస్యలు ఉంటే కనుక వేరే బ్యాంక్ అకౌంటును ప్రయత్నించండి. మీరు ఎంత పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు అనే దానిపై మీ బ్యాంక్ దాని స్వంత పరిమితులను కలిగి ఉండవచ్చు. లావాదేవీ వైఫల్యానికి సంబంధి మరింత సమాచారం మరియు స్పష్టత కోసం మీరు నేరుగా మీ బ్యాంక్‌ని కూడా సంప్రదించవచ్చు.

ఇతర పరిమితులు

మోసం నుండి రక్షించడానికి, కొన్ని లావాదేవీలు తదుపరి సమీక్ష కోసం ఫ్లాగ్ చేయబడవచ్చు. మీరు లావాదేవీ చేయడంలో సమస్య ఉన్నట్లయితే మరియు మీరు పరిమితిని చేరుకున్నారని మీరు అనుకోకుంటే, మీరు ఉపయోగిస్తున్న UPI యాప్ సపోర్ట్ టీమ్‌ని సంప్రదించండి.

Best Mobiles in India

English summary
UPI Daily Limits: How to Fix Issues If UPI Payment Fails

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X