గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
వేగవంతమైన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ ఒకటి. ఈ బ్రౌజర్‌కు ఎక్స్‌టెన్షన్‌లుగా అందుబాటులో ఉన్న పలు సరికొత్త ఫీచర్లను వెబ్ విహారాన్ని మరింత రసవత్తరం చేస్తున్నాయి. బ్రౌజింగ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగే వెబ్ బ్రౌజింగ్ టెక్నాలజీ ప్రియులకు ఎంతో కిక్కునిస్తుంది. గూగుల్ క్రోమ్ యూజర్ల కోసం అందుబాటులో ఉన్న పలు ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
యాడ్ పేజీలను బ్లాక్ చేసేందుకు ‘యాడ్ బ్లాక్ ప్లస్':
బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో మౌస్ బటన్ పై క్లిక్ చేసిన ప్రతిసారి యూజర్లను చికాకుకులోను చేస్తూ అనేక యాడ్ పేజీలు ఒపెన్ అవుతుంటాయ్. ఇలాంటి సందర్భాల్లో వాటిని బ్లాక్ చేసేందుకు అవకాశాన్నిచ్చే ఎక్స్‌టెన్షన్ పేరే యాడ్‌బ్లాక్ ప్లస్. ఈ ఫీచర్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే యాడ్ పేజీల తలనొప్పి ఇక ఉండదు.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
ఫోటోలను తీక్షణంగా వీక్షించేందుకు ‘హోవర్ జూమ్':
కొన్ని ఆన్‌లైన్ రిటైలింగ్ వెబ్‌సైట్‌లలో ఉత్పత్తులకు సంబంధించిన ఫోటోల పై మౌస్ పాయింటర్‌ను పెట్టినట్లయితే తక్షణమే ఆ ఇమేజ్ జూమ్‌లో కనిపిస్తుంది. ఇదే తరహాలో, అన్ని వెబ్‌సైట్‌లలోనూ ఇలాంటి అనుభవమే కావాలంటే క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న హోవర్ జూమ్ ఎక్స్‌టెన్షన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవడమే.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో అందుబాటులోన్న మరో ఎక్స్‌టెన్షన్ ‘అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్'. ఈ ఫీచర్ ద్వారా మన ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగిపోతున్న వారి జాబితాను తెలుసుకునే వీలుంది.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
పటిష్టమైన పాస్‌వర్డ్ కోసం ‘లాస్ట్ పాస్': గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న లాస్ట్‌పాస్ ఎక్స్‌టెన్షన్ తికమక పెట్టే గ్రామర్‌తో శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను తయారు చేస్తుంది.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
షెడ్యూలింగ్ కోసం ‘బఫర్': క్రోబ్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న బఫర్ ఎక్స్‌టెన్షన్ ద్వారా సోషల్ నెట్‌వర్కింగ్‌లలోని పోస్ట్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఎప్పుడూ ఫేసేబుక్‌ను ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేకించి కొన్ని బ్రౌజర్ షార్ట్ కట్స్‌నిఅందిస్తున్నాం.గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :
alt+m - new message
alt+0 - help center
alt+1 - homepage

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్ :
alt+ 2- profile page
alt+3 - manage friends list
alt+4 - messages list

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్
alt+5 - notification page
alt+6 - account settings

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..?
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్
alt+7 - privacy settings
alt+8 - facebook fan page
alt+9 - facebook terms
alt+? - search box


Click it and Unblock the Notifications