వాట్సాప్‌లో పెద్ద సైజ్ వీడియో, ఆడియో ఫైల్‌లను పంపడం ఎలా?

|

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ ఒకటి. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం కావున ఏదైన సృజనాత్మక మెసేజ్ లను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇందులో అన్నింటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే PDF ఫైల్స్ మరియు ఎక్సెల్ షీట్లతో సహా మీడియా ఫైల్స్ మరియు డాక్యుమెంట్లను కూడా ఇతరులతో పంచుకోవడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

వాట్సాప్ ద్వారా పెద్ద ఫైల్‌లను సెండ్ చేయడం
 

వాట్సాప్ ద్వారా పెద్ద ఫైల్‌లను సెండ్ చేయడం

వాట్సాప్ యాప్ ద్వారా 100MB పరిమాణంలో ఉన్న ఫైళ్ళను ఇతరులతో పంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. కానీ సాధారణంగా 16MB పరిమితి గల రికార్డ్ వీడియోలను మరొకరికి పంపడానికి వాట్సాప్ అనుమతిస్తుంది. వినియోగదారుడు ఈ పరిమితి కంటే పెద్ద ఫైల్‌ను పంపడానికి ప్రయత్నిస్తే కనుక ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ మెసేజ్ యాప్ వినియోగదారులకు ఎర్రర్ చూపుతుంది. కానీ వాట్సాప్ ఉపయోగించి 100MB కన్నా పెద్ద ఫైళ్ళను పంపడానికి వినియోగదారుల కోసం ఒక ప్రత్యామ్నాయం ఉంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌లో పెద్ద ఫైల్‌లను పంపే దశలు

వాట్సాప్‌లో పెద్ద ఫైల్‌లను పంపే దశలు

వాట్సాప్‌లో పెద్ద ఫైల్‌లను పంపడానికి గూగుల్ డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి ఆ లింక్‌ను వాట్సాప్‌లోని రిసీవర్‌తో పంచుకోవచ్చు. కింద ఉన్న పద్దతులను పాటించడం ద్వారా పెద్ద ఫైల్‌లను మరొకరితో పంచుకోవచ్చు.

స్టెప్ 1: మొదటగా గూగుల్ డ్రైవ్ ను ఓపెన్ చేయండి.

step2

స్టెప్ 2: స్క్రీన్ యొక్క కుడివైపు దిగువ మూలలో ఉన్న ప్లస్ చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 3: అప్‌లోడ్ ఫైల్‌పై నొక్కండి> తరువాత ఓపెన్ ఎంపికపై నొక్కండి.

స్టెప్ 4: ఫైల్ అప్‌లోడ్ అయిన తర్వాత మీరు గూగుల్ డ్రైవ్ యాప్ లో దీనిని చూస్తారు.

స్టెప్ 5: ఫైల్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కండి.

step6
 

స్టెప్ 6: తరువాత కాపీ లింక్ ఎంపికపై నొక్కండి.> అలా చేయడం వలన మీ ఫోన్ క్లిప్‌బోర్డ్‌లో షేర్ చేయదలచిన ఫైల్ లింక్ యొక్క నకలు సేవ్ అవుతుంది.

స్టెప్ 7: తరువాత వాట్సాప్‌ను ఓపెన్ చేయండి > మీరు ఈ లింక్‌ను షేర్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పేరు మీద నొక్కండి.

స్టెప్ 8: తరువాత మెసేజ్ టైప్ చేసే చోట ఎక్కువసేపు నొక్కండి. ఆపై ఇందులో కనిపించే "పేస్ట్" ఎంపికపై నొక్కండి.

స్టెప్ 9: మీరు మెసేజ్ బాక్స్ లో గూగుల్ డ్రైవ్ ఫైల్ యొక్క లింక్‌ను చూస్తారు. తరువాత "సెండ్" ఎంపిక మీద నొక్కండి!

Most Read Articles
Best Mobiles in India

English summary
Using WhatsApp How to Send The More Than 16MB Large File to Others

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X