ఓటర్ లిస్టులో పేరును చెక్ చేసుకోవడం ఎలా ?

Posted By: M KRISHNA ADITHYA

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక కీలకమైన ఘట్టం. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా కొత్తగా ఎలక్టోరల్ లిస్టులో నమోదు కావాలనుకునే వారిలో కుతూహలం ఉండట సహజమే. అలాగే అడ్రెస్ చేంజ్ తో పాటు పేరులో తప్పొప్పుల సవరణలు, ఇతర సవరణలతో ఓటర్ ఐడీని పొందవచ్చు. అయితే ఎన్నికల్లో ఓటు వేయాలంటే కేవలం ఓటర్ ఐడీ ఉంటే సరిపోదు. ఎలక్టోరల్ లిస్టులో మీ పేరు కూడా ఉండాలి. అప్పుడే మీరు ఓటు వేసే హక్కును పొందుతారు. అందు కోసం మీరు ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది పోల్చుకొని చూడాల్సి ఉంది.

మొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్త

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓటర్ లిస్టులో పేరు చెక్ చేసుకోవడం ఎలా ?

ఈ స్టెప్స్ తీసుకోవడం ద్వారా మీరు ఎన్నికల జాబితాలో పేరును పోల్చుకోవచ్చు.

1. నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌విఎస్‌పీ)లోని ఎలక్టోరల్ సెర్చి పేజ్ లోకి వెళ్లండి.

2. అందులో పేరును టైప్ చేసి కూడా వెతకవచ్చు. అలాగే మీ ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నెంబర్ ను టైప్ చేసి దాని ద్వారా ఓటర్ లిస్టులో మీ పేరును వెతకవచ్చు.

 

ఎపిక్ నెంబర్ తో ఓటర్ లిస్టులో పేరు చెక్ చేసుకోవడం ఎలా ?

1. ఎన్‌విఎస్‌పీ ఎలక్టోరల్ సెర్చ్ పేజీలోకి వెళ్లండి
2. సెర్చ్ ఎపిక్ నెంబర్ ఆప్షన్ ను క్లిక్ చేయండి
3. ఇప్పుడు అందులో ఎపిక్ నెంబర్ ‌ను టైప్ చేయండి, అలాగే నివసించే రాష్ట్రం, జెండర్, వయస్సు, అసెంబ్లీ నియోజకవర్గం, మొ.వి టైప్ చేయండి, అనంతరం ఒక క్యాప్చా ఇమేజ్ వస్తుంది. దాన్ని టైప్ చేసి సెర్చి బటన్ క్లిక్ చేయండి.
4. మీరు రిజల్ట్స్ చెక్ చేయండి, అందులో మీ పేరు నమోదై ఉన్నట్లయితే, ఎలక్టోరల్ లిస్టులో మీ పేరు ఉన్నట్లు, లేకపోతే మీరు నమోదు కానట్లే.

 

 

ఎపిక్ నెంబర్ లేకుండా ఓటర్ జాబితాలో పేరు వెతకడం ఎలా ?

1. ఎన్‌విఎస్‌పీ ఎలక్టోరల్ సెర్చ్ పేజీలోకి వెళ్లండి
2. సెర్చ్ బై డిటైల్స్ ఆప్షన్ ను క్లిక్ చేయండి
3. ఇప్పుడు అందులో మీ పేరు, అలాగే నివసించే రాష్ట్రం, జెండర్, వయస్సు, అసెంబ్లీ నియోజకవర్గం, మొ.వి టైప్ చేయండి, అనంతరం ఒక క్యాప్చా ఇమేజ్ వస్తుంది. దాన్ని టైప్ చేసి సెర్చి బటన్ క్లిక్ చేయండి.
4. మీరు రిజల్ట్స్ చెక్ చేయండి, అందులో మీ పేరుతో పాటు మీ ప్రాంతం కరెక్టుగా నమోదై ఉన్నట్లయితే, ఎలక్టోరల్ లిస్టులో మీ పేరు ఉన్నట్లు, లేకపోతే మీరు నమోదు కానట్లే.

కొన్ని సందర్భాల్లో..

సాధారణంగా కొన్ని సందర్భాల్లో మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఎలక్షన్ కమీషన్ డేటా బేస్ లో స్టోర్ అయి ఉండవచ్చు. అప్పుడు కూడా మీ పేరు ఓటర్ లిస్టులో లభ్యం కాకపోవచ్చు. అలాగే ఎపిక్ నెంబర్ ద్వారా మీ పేరు ఓటర్ లిస్టులో లేకపోవడం అత్యధిక శాతం వరకూ జరగదు.

ఎస్ఎంఎస్ ద్వారా ..

మరోవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడుల్లో ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఓటర్ లిస్టులో పేరును చెక్ చేసుకునే సదుపాయం ఉంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ సైట్ లోకి వెళ్లి మీ రాష్ట్రానికి సంబంధించిన పోర్టల్ లో పేర్లను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Voter List: How to Check if Your Name Is on Electoral Rolls in India More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot