ఆధార్ కార్డ్ అడ్రస్ ఛేంజ్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్‌తో మీరే సరిచేసుకోండి

మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఛేంజ్ చేయాలా? కంగారపడకుండి, ఆ పని మీ ఇంటి వద్దనే అయిపోతుంది. ఇంతకుముందు మాదిరిగా ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు రోజుల తరబడి ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగనవసరం లేదు.

|

ముందుగా UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి Address Update Request (Online) ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఓ కొత్త టాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ పేజీలోని ఇన్‌స్ట్రక్షన్స్‌ను పూర్తిగా చదువుకుని పేజీ క్రింది భాగంలో కనిపించే ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. తరువాత ఓపెన్ అయ్యే మెనూలో మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే ఓ టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే వన్‌‌టైమ్ పాస్‌వర్డ్ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది.

 

రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్

 ఫోన్‌కు అందిన ఓటీపీని ఎంటర్ చేయటం ద్వారా...

ఫోన్‌కు అందిన ఓటీపీని ఎంటర్ చేయటం ద్వారా...

ఫోన్ అందిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే డేటా అప్‌డేట్ రిక్వెస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అడ్రస్ తాలూకా మార్పుచేర్పులను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ పేజీలోకి వెళతారు. ఇక్కడ అడ్రస్ ధృవీకరణకు అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్‌‌‌‌ను మీరు అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా బీపీఓ సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా ప్రొసీజర్ మొత్తం పూర్తవుతుంది.

 

 

మొబైల్ నెంబర్ మనుగడలో లేకపోయినట్లయితే..

మొబైల్ నెంబర్ మనుగడలో లేకపోయినట్లయితే..

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను ట్రాక్ చేసుకోవాలంటే
 

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌ను ట్రాక్ చేసుకోవాలంటే

ఆన్‌లైన్ ద్వారా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ వెరిఫికేషన్ అలానే అథెంటికేషన్ ప్రాసెస్‌లను ముగించుకున్న తరువాత UIDAI రికార్డులలో అప్‌డేట్ కాబడుతుంది. అప్ డేట్ అయిన వివరాలను https://ssup.uidai.gov.in/web/guest/check-status పేజీలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఈ పేజీలో ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

 

 

ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

ముందుగా https://eaadhaar.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి. ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి. పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్‌వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Thankfully, it is pretty to change or update Aadhaar card address online as the UIDAI website allows citizens to perform the whole process from the comfort of their homes with just a few clicks.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X