మీ ఆధార్‌కి పాన్ కార్డు లింక్ చేసారా..? ఇదుగోండి సింపుల్ ప్రొసీజర్

జూలై 1, 2017 నుంచి పాన్ కార్డ్‌కు ధరఖాస్తు చేసుకునే వారు ఖచ్చితంగా ఆధార్ నెంబర్‌ను కలిగి ఉండాలి. ఆధార్ కార్డుతో అన్ని ప్రభుత్వ సర్వీసులను లింక్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డును కూడా తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 1, 2017లోగా మీ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదు...

ఆధార్ కార్డుకు పాన్ నెంబర్‌ను లింక్ చేయని పక్షంలో వచ్చే సంవత్సరం జనవరి ఒకటో తేదీ తర్వాత ఆ పాన్ కార్డు ఎందుకూ పనికిరాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది తమ ఆధార్‌కి పాన్ కార్డును లింక్ చేసే ప్రయ్నతంలో ఉన్నారు. మీరు కూడా మీ ఆధార్‌ కార్డుకు పాన్ నెంబర్‌ను లింక్ చేయాలని చేస్తున్నట్లయితే ఈ సింపుల్ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

e-filling portal ద్వారా..

మీ ఆధార్‌కు పాన్ నెంబర్‌ను లింక్ చేసే క్రమంలో ముందుగా ఇన్‌కమ్ టాక్స్ e-filling portalలో లాగిన్ కావాల్సి ఉంటుంది. మీ వివరాలతో అందులో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది.

portalలోకీ లాగిన్ కాగానే

portalలోకీ లాగిన్ కాగానే, అక్కడ పాప్ అప్ విండో ఒకటి కనిపిస్తుంది. ఆధార్ లింక్ చేయమని అడుగుతుంది. ఆధార్ నంబర్‌తో పాటు పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఓటీపీ కోడ్ వస్తుంది...

మీరు ఇచ్చిన వివరాలు కరెక్ట్‌గా ఉంటే అక్కడ Link Now అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ కోడ్ వస్తుంది. దాంతో పాటు మీ మెయిల్‌కి ఓ లింక్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఓటీపీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిపోగానే మీకు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ అయిందంటూ మెసేజ్ కనిపిస్తుంది. ఇలా వచ్చిందంటే మీ పని విజయవంతంగా పూర్తయినట్లే... 

ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా...

ఆధార్ నెంబర్‌ను PAN నెంబర్‌తో లింక్ చేసుకునేందుకు గాను ఎస్ఎంఎస్ సౌకర్యాన్నిఅందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తమ ఆధార్ నెంబర్లను పాన్ నెంబర్లతో లింక్ చేసుకోవచ్చని కోరింది.

567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా

మొబైల్ ఫోన్ నుంచి 567678 లేదా 56161 నెంబర్లకు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా ఆధార్, పాన్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుందని, ఎస్ఎంఎస్ చేసే ప్రొసీజర్‌ను జాతీయ దినపత్రికల్లో ప్రచురించిన ప్రకటనల్లో వివరించినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఎస్ఎంస్ చేసే విధానం..

UIDPAN అని టైప్ చేసి టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి మీ 12 డిజిట్ల ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తరువాత మళ్లీ కొంచం స్పేస్ ఇచ్చి మీ 10 డిజిట్ల పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. UIDPAN<12 digit Aadhar><10 digit PAN> టైప్ చేసిన మెసెజ్‌ను 567678 లేదా 56161 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Want to link your Aadhaar to PAN? Here are Some easy steps to do it in. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot