Home
How to

మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఈ ఒక్క కోడ్‌తో ఇప్పుడే తెలుసుకోండి..!

Phone is Hacked: స్మార్ట్‌ఫోన్లు మన జీవితాల్లో ఒక భాగమైపోయాయి. పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు, సీక్రెట్ చాటింగ్స్ అన్నీ వాటిలోనే దాచుకుంటున్నాం. అందుకే హ్యాకర్లు వీటిపై కన్నేశారు. మీ ఫోన్ ఎప్పుడైనా హ్యాక్ అయితే మీ పర్సనల్ విషయాలు బయటకు పోవచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు, ఐడెంటిటీ కూడా దొంగతనానికి గురికావచ్చు. కానీ భయపడకండి, మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు, ఒకవేళ అయితే దాన్ని ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూసేయండి.

* ఫోన్ హ్యాక్ అయిందని చెప్పే సంకేతాలు..

1. మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుమానించడానికి బ్యాటరీ తొందరగా అయిపోవడం, డేటా వాడకం పెరిగిపోవడం కూడా ముఖ్యమైన సంకేతాలు. మీ ఫోన్‌లో మాల్వేర్ లేదా స్పైవేర్ వంటివి రన్ అవుతుంటే, అవి బ్యాటరీని చాలా వేగంగా ఖాళీ చేస్తాయి. నార్మల్‌గా కంటే ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోతుంటే ఒకసారి చెక్ చేసుకోవాలి.

Warning Signs Your Phone is Hacked and How to Secure It

2. అలాగే, ఎప్పుడూ వాడే డేటా కంటే సడన్‌గా ఎక్కువ డేటా వాడకం పెరిగినా అనుమానించాలి. ఎందుకంటే హ్యాకర్లు మీ ఫోన్ ద్వారా డేటా దొంగిలిస్తుంటే, డేటా వాడకం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంటే జాగ్రత్త పడాలి. హ్యాక్ అయిన ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ప్రాసెస్‌లు నడుస్తుంటాయి. దాంతో ఫోన్ వేడెక్కుతుంది.

3. మీ ఫోన్ బాగా స్లోగా పనిచేస్తుంటే, ఫ్రీజ్ అవుతుంటే లేదా హ్యాంగ్ అవుతుంటే మాల్వేర్ వల్ల రిసోర్స్‌లు వాడబడుతుండొచ్చు. అలాగే మీ ఫోన్‌లో మీకు తెలియని యాప్స్ కనిపిస్తే వెంటనే వాటిని గమనించాలి. స్పైవేర్ లేదా హ్యాకింగ్ యాప్స్ మీ పర్మిషన్ లేకుండానే ఇన్‌స్టాల్ అయిపోతాయి.

4. మీరు బ్రౌజ్ చేయకపోయినా యాడ్స్ వస్తుంటే, పాప్-అప్స్ కనిపిస్తుంటే మీ ఫోన్‌లో యాడ్‌వేర్ ఉండి ఉండొచ్చు. మీ ఫోన్ నుంచి మీరు చేయని మెసేజ్‌లు వెళ్లినా, కాల్స్ పోయినా మీ ఫోన్‌ను ఎవరో కంట్రోల్ చేస్తున్నారని అర్థం. మీ ఆన్‌లైన్ అకౌంట్లలో మీకు తెలియకుండా లాగిన్స్, మార్పులు జరిగితే ఫోన్ హ్యాక్ అయి ఉండొచ్చు.

* హ్యాకింగ్ కోసం డిటెక్షన్ కోడ్స్

మీ ఫోన్ ట్యాంపర్ అయిందా లేదా అని చెక్ చేయడానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. వాటిని డయల్ చేసి చూడాలి. ముఖ్యంగా *# 06# డయల్ చేయాలి. ఇది మీ ఫోన్ IMEI నంబర్‌ను చూపిస్తుంది. ఒకవేళ అది ఫోన్‌కు మ్యాచ్ అవ్వకపోతే మీ ఫోన్ క్లోన్ అయి ఉండొచ్చు.

అలాగే *# 21# డయల్ చేసి మీ కాల్స్, మెసేజ్‌లు లేదా డేటా మీకు తెలియకుండా ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయవచ్చు. *# 62# డయల్ చేసి అందుబాటులో లేనప్పుడు మీ కాల్స్ లేదా మెసేజ్‌లు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతున్నాయో గమనించవచ్చు. ##002# డయల్ చేసి కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్‌ను డిసేబుల్ చేయొచ్చ. హ్యాకర్లు కాల్స్‌ను దారి మళ్లించడానికి దీన్ని వాడుకోవచ్చు.

* హ్యాక్ అయిన ఫోన్‌ను ఎలా సరిచేసుకోవాలి

మీ హ్యాక్ అయిన ఫోన్‌ను సరిచేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ ఉన్నాయి. మొదటిగా, మీకు అనుమానంగా ఉన్న యాప్స్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత, ఒక మంచి సెక్యూరిటీ యాప్‌ను ఉపయోగించి మీ ఫోన్‌ను పూర్తిగా స్కాన్ చేయండి. ఇది వైరస్‌లు, హ్యాకింగ్ ప్రోగ్రామ్‌లను గుర్తించి తొలగిస్తుంది.

ఇంకా ముఖ్యంగా, మీ ఫోన్‌కు లింక్ అయిన అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి. అదనపు భద్రత కోసం, టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (2FA) సెటప్ చేసుకోండి, ఇది మీ అనుమతి లేకుండా ఎవరూ మీ అకౌంట్లలోకి లాగిన్ అవ్వకుండా అడ్డుకుంటుంది. చివరగా, పైన చెప్పినవన్నీ చేసినా సమస్య తగ్గకపోతే, మీ డేటాను బ్యాకప్ చేసి, ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమం. ఇది మీ ఫోన్‌ను దాదాపు కొత్తదానిలా చేస్తుంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X