బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి..!
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో భారత్ అత్యంత కీలకంగా ఉంది. దేశంలో ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ ల నుంచి ఫ్లాగ్‌షిప్ మోడళ్ల వరకు భారీ డిమాండ్ ఉంటోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో గేమింగ్ హ్యండ్‌సెట్‌లను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కారణంతో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా గేమింగ్ ఫోన్‌ల విడుదలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. గేమింగ్ కోసం వారి హ్యాండ్‌సెట్ లు ఎంత అనువుగా ఉంటాయో విడుదల సమయంలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తున్నాయి. స్మూత్ ఫెర్మామెన్స్ కోసం ఆయా సంస్థలు వినియోగిస్తున్న టెక్నాలజీని కూడా వివరిస్తున్నాయి.
కరోనా సహా అనంతర కాలంలో గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఫోన్‌లు (Gaming Smartphone) కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే సాధారణ స్మార్ట్‌ఫోన్ లను కొనుగోలు చేసిన సమయంలో యూజర్లు... డిజైన్, కెమెరా, డిస్‌ప్లే, స్టోరేజీ స్పెసిఫికేషన్ లు చూసుకొని కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రత్యేకంగా గేమింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ లు కొనుగోలు చేయాలంటే ఎలాంటి స్పెసిఫికేషన్ లు, ఫీచర్‌లను కలిగి ఉండాలి.

గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను (Factors to Decide Gaming Phone) కొనుగోలు చేసే సమయంలో ముఖ్యంగా ప్రాసెసర్ / చిప్‌సెట్, ర్యామ్ మరియు స్టోరేజీ, గేమింగ్ ఫీచర్ లు, థర్మల్ మేనేజ్‌మెంట్ సహా డిస్‌ప్లే స్పెసిఫికేషన్‌లను చూసుకొని కొనుగోలు చేయాలి. గేమింగ్ సమయంలో స్మూత్ ఫెర్మామెన్స్ కోసం ఈ పైన తెలిపిన ఐదు అంశాలు ఎంతో ఉపయోగపడతాయి.
ప్రాసెసర్ / చిప్‌సెట్ : గేమింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే మీరు ముందుగా మంచి ప్రాసెసర్/ చిప్‌సెట్ ను (Smartphone Chipset) ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసర్ GPU, CPU లు స్మార్ట్‌ఫోన్ గేమింగ్ పనితీరును ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్ లేదా మీడియాటెక్ ప్రాసెసర్‌లు గేమింగ్ కు అనుకూలమైన ప్రాసెసర్‌లుగా ఉన్నాయి.
ర్యామ్ మరియు స్టోరేజీ : ల్యాగ్ ఫ్రీ గేమింగ్ కోసం ఎక్కువ ర్యామ్ కావాల్సి (RAM) ఉంటుంది. దీంతోపాటు మల్టీ టాస్కింగ్, గ్రాఫిక్స్, విజువల్ పరంగాను స్మూత్ పెర్మామెన్స్ ను అందిస్తుంది. కనీసం 8GB ర్యామ్ ఉండే హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయండి. దీంతోపాటు స్టోరేజీ కూడా గేమింగ్ అనుభూతిని ప్రభావితం చేస్తుంది. అధిక స్టోరేజీ కలిగిన ఫోన్‌లో పెద్ద సైజ్ కలిగిన గేమ్స్‌తోపాటు అప్‌డేట్ లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గేమింగ్ ఫీచర్‌లు : స్మూత్ గేమింగ్ కోసం ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు ప్రత్యేకంగా గేమింగ్ ఫీచర్‌లను (Gaming Features) అందిస్తున్నాయి. ఈ ఫీచర్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు కూడా ఉంటున్నాయి. గేమ్ మోడ్, హెప్టిక్ ఫీడ్‌బ్యాక్, AI గేమింగ్ ఫీచర్ లు వంటివి ఉండేలా చూసుకోండి.
డిస్‌ప్లే : గేమింగ్ సమయంలో మెరుగైన అనుభూతి కోసం అమోలెడ్, OLED డిస్‌ప్లేలను కలిగి ఫోన్‌లను ఎంచుకోవాలి. దీంతోపాటు మెరుగైన డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు అధిక రిజల్యూషన్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ను ఎంచుకోవాలి. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక మోడళ్లు ఈ రెండు డిస్‌ప్లేలను ఎక్కువగా కలిగి ఉంటున్నాయి.
థర్మల్ మేనేజ్‌మెంట్ : గేమింగ్ సమయంలో ఎలాంటి స్మార్ట్‌ఫోన్ లు అయినా వేడెక్కే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే మెరుగైన కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటున్నాయి. అందువల్ల కూలింగ్ సిస్టమ్ (Cooling System) కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఎంచుకోవాలి. ర్యామ్, స్టోరేజీ, చిప్‌సెట్‌తోపాటు దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.


Click it and Unblock the Notifications








