AC సర్వీసింగ్ సమయంలో ఇవి కచ్చితంగా తనిఖీ చేయాలి.. ఎందుకంటే..?
వేసవి కాలం ప్రారంభం అయింది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈ వేసవిలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందనే అంచనాలు ఇప్పటికే వెల్లడవుతున్నాయి. ఫలితంగా ఎయిర్‌కూలర్లు, ఎయిర్ కండిషనర్ల వినియోగం క్రమంగా ప్రారంభం అవుతోంది. అయితే సుదీర్ఘ విరామం అనంతరం ఎయిర్ కండిషనర్ (AC) వినియోగించాలని భావిస్తే.. అంతకంటే ముందే కచ్చితంగా సర్వీస్ చేయించడం ఉత్తమం.
ఏసీలను సర్వీసింగ్ చేయించే సమయంలో కొన్ని విభాగాలను కచ్చితంగా తనిఖీ చేయాలి. దీంతోపాటు గతంలో AC వినియోగించే సమయంలో మీరు ఎటువంటి సమస్యలు గుర్తించినా, అనవసర శబ్ధాలు వినిపించినా టెక్నీషియన్‌కు చెప్పి మరమ్మతులు చేయించుకోవాలి.

ఏసీ ఎయిర్ ఫిల్టర్లు శుభ్రం చేసుకోవాలి :
ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నప్పుడు ఎయిర్ ఫిల్టర్లు దుమ్మ. దూళితో నిండిపోతాయి. దీని వల్ల కూలింగ్ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీంతో ఏసీ సక్రమంగా పనిచేసేందుకు అధిక విద్యుత్ అవసరం అవుతుంది. సర్వీసింగ్ సమయంలో టెక్నీషియన్‌లు ఫిల్టర్లను శుభ్రం చేస్తారు.
అయితే ప్రతి రెండు మూడు వారాలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా గాలి ప్రవాహం సక్రమంగా ఉంటుంది. ఫలితంగా అలెర్జీలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
గ్యాస్ (రిఫ్రిజిరెంట్) స్థాయి తనిఖీ చేయడం :
సర్వీసింగ్ సమయంలో టెక్నీషియల్ గ్యాస్ స్థాయిని కచ్చితంగా తనిఖీ చేస్తారు. గ్యాస్ స్థాయి తగినంత ఉంటేనే, కూలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. రిఫ్రిజిరెంట్ స్థాయిల్లో హెచ్చుతగ్గులను సర్వీసింగ్ సమయంలో సరిచేస్తారు.
డ్రైన్ పైపుల క్లీనింగ్ :
AC గాలిలోని తేమను గ్రహిస్తుంది. ఆ నీటిని డ్రైన్ పైపుల ద్వారా బయటకు పంపుతుంది. ఈ పైపుల్లో దుమ్ము, ధూళి ఉంటే, నీటి ప్రవాహం మందగిస్తుంది. ఫలితంగా ఆ నీరు గదిలోనే లీక్ అవుతుంది. సర్వీసింగ్ సమయంలో ఈ పైపులను టెక్నిషియను శుభ్రం చేస్తారు.
కాయిల్స్ తనిఖీ :
ఎయిర్ కండిషనర్ లోపల ఉన్న కాయిల్స్ వేడిని బయటకు పంపుతాయి. ఫలితంగా కాయిల్స్‌కు ధూళి, దుమ్ము చేరుతుంది. సర్వీసింగ్ సమయంలో ఈ కాయిల్స్‌ను శుభ్రం చేయించాలి. ఫలితంగా వేడి బయటకు వెళ్లే ప్రక్రియ సాఫీగా సాగుతుంది. గది త్వరగా చల్లబడుతుంది.
విద్యుత్ కనెక్షన్‌లు :
సర్వీసింగ్ సమయంలో AC విద్యుత్ కనెక్షన్‌లు తనిఖీ చేస్తారు. వైర్లు సక్రమంగా ఉన్నాయా, సెన్సార్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, కెపాసిటర్లు పరిస్థితినీ తనిఖీ చేస్తారు. ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్నా... ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల విద్యుత్ కనెక్షన్‌లను పూర్తిగా తనిఖీచేసి, సమస్యలు ఉంటే మరమ్మతులు చేస్తారు.
అవుట్‌డోర్ యూనిట్ :
ఏసీల్లో ఇన్‌పుట్ యూనిట్‌ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. అవుట్‌డోర్ యూనిట్‌ను కూడా అదే జాగ్రత్తగా పరిరక్షించాల్సి ఉంటుంది. అవుట్‌పుట్ యూనిట్ దుమ్ము, ధూళి చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. గాలి ప్రవాహానికి సక్రమంగా ఉండేందుకు ఈ యూనిట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే సర్వీసింగ్ సమయంలో అవుట్‌డోర్ యూనిట్‌ను కచ్చితంగా శభ్రం చేస్తారు. దీంతోపాటు దీని చుట్టు గాలి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలి. నేరుగా సూర్యకాంతి అవుట్‌డోర్ యూనిట్‌పై పడకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. అప్పుడే ఏసీ సక్రమంగా పనిచేస్తుంది.
AC టెక్నిషియన్‌లు చాలా వరకు సర్వీసింగ్ సమయంలో అన్ని విభాగాలను క్షుణ్నంగా తనిఖీ చేసి, మరమ్మతులు చేస్తారు. అయితే పైన తెలిపిన విభాగాల్లో తనిఖీలు చేయడం మర్చిపోతే.. ముందస్తు జాగ్రత్తగా మీరే ఈ విభాగాలను తనిఖీ చేయాలని కోరడం ఉత్తమం.


Click it and Unblock the Notifications









