Smartphone Usage Tips స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు..!!
స్మార్ట్‌ఫోన్ లు ప్రస్తుతం చాలా మంది చేతుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సుమారుగా కొందరికి ఫోన్ లేకుండా రోజు గడవని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా యువత గంటల సమయం ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతోపాటు వివిధ పనులను స్మార్ట్‌ఫోన్ ద్వారా చేసేస్తున్నారు. అయితే ఫోన్ వినియోగిస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఫోన్ పనితీరు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఫోన్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు ఎక్కువ కాలం వినియోగానికి అనువుగా ఉండాలంటే ఈ కింది చిట్కాలు పాటించండి.
స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర డివైజ్‌లు ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఛార్జింగ్ సమయంలో (Smartphone Charging Tips) జాగ్రత్తలు వహించాలి. అయితే చాలా మంది తమ ఎలక్ట్రానిక్ డివైజ్ ల ఛార్జింగ్ సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అందువల్ల తక్కువ సమయం లోనే డివైజ్‌లు డ్యామేజీ అవుతున్నాయి.

రాత్రంతా స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ :
స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జింగ్ అయ్యాక ఛార్జర్ ను డిస్ కనెక్ట్ చేయాలి. కొంత మంది యూజర్లు రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. అలాంటి ఫోన్‌ల బ్యాటరీలు త్వరగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఫోన్ పనితీరు పైనా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు బ్యాటరీలు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఛార్జింగ్ టెక్నాలజీ :
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్ లు రీఛార్జ్‌బుల్ లిథియం అయాన్ బ్యాటరీలను కలిగి ఉంటాయి. ఫలితంగా బ్యాటరీ ఫుల్ ఛార్జి అయ్యాక... ఆటోమేటిక్ గా ఛార్జింగ్ నిలిచిపోయే టెక్నాలజీని కలిగి ఉంటాయి. అయితే ఫుల్ ఛార్జి అయిన వెంటనే ఛార్జింగ్ ను డిస్‌కనెక్ట్ చేయడం ఉత్తమం.
చాలా మంది ఫోన్ ఛార్జింగ్ 20 శాతం లేదా అంతకంటే తక్కువ ఛార్జింగ్ తోనూ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఇలా ఎక్కువ సార్లు వినియోగిస్తే ఫోన్ బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. మరి కొంత మంది యూజర్‌లు ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు ఫోన్‌ను వినియోగిస్తుంటారు. ఈ హ్యాండ్‌సెట్‌ల బ్యాటరీ తోపాటు ఫోన్ పనితీరుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్ :
కొన్ని పాత స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. అలాంటి ఫోన్‌ల బ్యాటరీ ఓవర్ హీట్ కారణంగా పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సందర్భాల్లో అక్కడకు సమీపంలోని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యే అవకాశం కూడా ఉంది. రిమైండర్ సాయంతో అయినా 100 శాతం ఛార్జింగ్ కంటే ముందే డిస్‌కనెక్ట్ చేయడం ఉత్తమం.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మెరుగైన పనితీరు అందించాలంటే.. 80 శాతం నుంచి 90 శాతం ఛార్జింగ్ పూర్తవగానే డిస్‌కనెక్ట్ చేయడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇలా చేస్తే బ్యాటరీ ఆరోగ్యకరమైన పనితీరు కనబరుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా ఫోన్ కూడా ఎక్కువ కాలం మన్నిక వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
దీంతోపాటు దూరప్రాంత ప్రయాణాల సమయంలో అనేక మంది రైల్వే స్టేషన్‌లు, ఎయిర్‌పోర్ట్, బస్ స్టేషన్‌లలో USB కేబుల్‌తో ఛార్జింగ్ చేస్తుంటారు. అయితే ఇది అన్ని సందర్భాల్లో సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల ద్వారా నేరగాళ్లు సైబర్ దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
దూరప్రాంత సందర్భాల్లో USB ఛార్జింగ్ బదులుగా సాధారణ ఛార్జర్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. లేకుంటే పవర్ బ్యాంకులు తమ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు USB ఛార్జింగ్ స్టేషన్‌లపై దాడి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








